Upcoming Cars in January 2025: ఈ నెలలో రానున్న కార్లు ఇవే - ఎన్ని లాంచ్ కానున్నాయంటే?
Upcoming Cars in India: 2025 జనవరిలో మనదేశంలో చాలా కార్లు లాంచ్ కానున్నాయి. వీటిలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ నుంచి ఎంజీ సైబర్‌స్టర్ వరకు చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి.
Upcoming Car Launches in January 2025: జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో చాలా కార్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ జాబితాలో మహీంద్రా, మారుతి, మెర్సిడెస్ వరకు అనేక కంపెనీల పేర్లతో సహా అనేక కార్లు ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric)
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ని ఆటో ఎక్స్‌పో సమయంలో విడుదల చేయవచ్చు. ఈ కార్యక్రమం జనవరి 17వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య జరగనుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 500 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇవ్వగలదు.
మారుతీ సుజుకి ఈ-విటారా (Maruti Suzuki E-Vitara)
మారుతి సుజుకి ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ-విటారా అనే ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. మారుతి సుజుకి ఈ-విటారా 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఈ-విటారా రేంజ్ 500 కిలోమీటర్ల వరకు ఉండనుందని కంపెనీ అంటోంది. ఈ ఎలక్ట్రిక్ కారులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి ఈ-విటారాలో మీరు 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లను పొందుతారు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)
ఈ జాబితాలో మూడో కారు ఎంజీ సైబర్‌స్టర్. ఇది స్పోర్ట్స్ కారు. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చిన ఈ కారు 510 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఎంజీ సైబర్‌స్టర్ అనేది స్పోర్ట్స్ కారు. ఇది 3.2 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
మెర్సిడెస్ ఈక్యూఎస్ 450 ఎస్‌యూవీ (Mercedes EQS 450 SUV)
మెర్సిడెస్ ఈక్యూఎస్ 450 ఎస్‌యూవీని కంపెనీ భారతదేశంలో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జనవరి 9వ తేదీన విడుదల కానుంది. దీనికి 17.7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 360 డిగ్రీ కెమెరా, 5 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్లను అందించవచ్చు.
కియా సైరోస్ (Kia Syros)
కియా ఇటీవలే సైరోస్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. దాని ధరలను ఆటో ఎక్స్‌పో సమయంలో ప్రకటించనున్నారు. కియా సైరోస్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. సైరోస్‌లో 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ యూనిట్లను అందించవచ్చు. ఈ కారుకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు చెల్లించి దీన్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
World’s Fastest MG Roadster.
— MG Select (@MGSelectIndia) December 2, 2024
The MG Cyberster - a fusion of legacy and innovation. Born from the past, engineered for tomorrow.
Premiering January 2025.#MGSelect pic.twitter.com/EWI2vjnJnm