అన్వేషించండి

Tata Punch EV Launch Date: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ రిలీజ్ డేట్ ఇదే - ధర ఎంత ఉండవచ్చు?

Tata Punch EV Expected Price: టాటా పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్ జనవరి 17వ తేదీన లాంచ్ కానుంది.

Tata Punch EV: భారతదేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ ఒక్కసారిగా బూమ్‌లోకి వచ్చింది. ప్రజలు కార్లను కొనుగోలు చేయడాన్ని మార్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ మరో మార్పును ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఈవీతో టాటా మోటార్స్ ఈ విభాగంలో పెద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ జనవరి 17వ తేదీన విడుదల కానుంది. దీని బుకింగ్ ఇప్పటికే రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ప్రారంభమైంది. ఇది స్మార్ట్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

టాటా పంచ్ ఈవీ డిజైన్
కంపెనీ ఇప్పటికే ఈ కారును రివీల్ చేసింది. ఇది టాటా జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్‌పై తయారయింది. ఇది డిజైన్ పరంగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని పోలి ఉంటుంది. ముఖ్యంగా ముందువైపు పూర్తి వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడా వచ్చింది. బంపర్, గ్రిల్ డిజైన్ కూడా నెక్సాన్ తరహాలో ఉంది. ప్రత్యేక ఫీచర్ల గురించి చెప్పాలంటే... ఫ్రంట్ బంపర్‌లో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, వర్టికల్ స్ట్రెక్‌లతో కూడిన కొత్త దిగువ బంపర్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

పంచ్ ఈవీ గురించి మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే టాటా ఇందులో ఫ్రంట్ మౌంటెడ్ ఛార్జర్ అందించింది. అంటే కారును ముందు వైపు నుంచి ఛార్జ్ చేయవచ్చన్న మాట. ఈ ఛార్జింగ్ పోర్టును బ్రాండ్ లోగో కింద తెలివిగా హైడ్ చేశారు.

టాటా పంచ్ ఈవీ రేంజ్
కంపెనీ ఇంకా దీని ఇంజిన్ వివరాలను వెల్లడించలేదు. అయితే వీటిని స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్‌లలో అందించవచ్చని భావిస్తున్నారు. దీని పరిధి 300 నుంచి 375 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చు.

టాటా పంచ్ ఈవీ అంచనా ధర
దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ఈవీ సిట్రోయెన్ ఈసీ3తో పోటీపడుతుంది. అందువల్ల దీని ధర రూ.11-13 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Tata Nexon నుంచి Hyundai Creta వరకు.. పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న 10 కార్లు, మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు!
రూ.10 లక్షలలోపే పానోరమిక్‌ సన్‌రూఫ్ కారు.. గాలిలో తేలుతూ వెళ్లే అనుభూతిని ఎంజాయ్‌ చేయండి!
KTM 200 Dukeలో క్లచ్‌ అవసరం లేకుండానే గేర్లు మార్చొచ్చు.. కొత్తగా క్విక్‌షిఫ్టర్, రైడ్ మోడ్స్‌, ట్రాక్షన్ కంట్రోల్
యూత్‌ఫుల్‌ ఫీచర్లతో KTM 200 Duke లాంచ్.. రైడింగ్‌ థ్రిల్‌ పెంచే నయా అప్‌గ్రేడ్స్!
రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
Embed widget