అన్వేషించండి

Tata Punch Down Payment: Tata Punch కొనాలనుకుంటున్నారా? EMI, డౌన్ పేమెంట్ వివరాలు సమాచారం ఇదే !

Tata Punch Finance Options: మీరు టాటా పంచ్‌ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, పూర్తి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు. ఈ SUVని ఫైనాన్స్‌లో కూడా తీసుకోవచ్చు.

Tata Punch Price, Down Payment, Loan and EMI Details: భారతీయ మార్కెట్లో, ఆర్థికంగా అందుబాటులో ఉండడంతో పాటు మంచి మైలేజీని ఇచ్చే SUVల్లో టాటా పంచ్ ఒకటి. ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ కారు. ఈ కారు ధర రూ. 7 లక్షల పరిధిలో ఉంది. టాటా పంచ్ కొనడానికి మీరు పూర్తి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు. అయితే, రూ. 10 వేల డౌన్‌ పేమెంట్‌తో టాటా పంచ్‌ కొనలేరు, మీ దగ్గర కనీసం లక్ష రూపాయలు ఉండాలి.

తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్‌ రేటు ఎంత? 
టాటా పంచ్ బేస్‌ మోడల్‌ 'ప్యూర్‌ పెట్రోల్' వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Tata Punch ex-showroom price) రూ. 6.20 లక్షలు. ఈ కారు రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు రూ. 89,000, ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 34,000, ఇతర ఖర్చులు కలుపుకుని... తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్‌ ఆన్‌-రోడ్‌ రేటు (Tata Punch on-road price) రూ. 7.43 లక్షలు అవుతుంది.

టాటా పంచ్‌ EMI ఆప్షన్స్‌
మీరు, ఈ కారు కొనడానికి లక్ష రూపాయలను డౌన్‌ పేమెంట్‌ చేస్తే, బ్యాంక్‌ నుంచి రూ. 6.43 లక్షల రుణం లభిస్తుంది. ఈ లోన్‌ మీద బ్యాంక్‌ 9 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుందని అనుకుందాం. ఇప్పుడు EMI ఆప్షన్స్‌ చూద్దాం.

7 సంవత్సరాల్లో కార్‌ లోన్‌ మొత్తం క్లియర్‌ చేయాలనుకుంటే, మీరు నెలకు రూ. 10,345 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 2,26,003 & కారు మొత్తం ధర రూ. 8,69,003 అవుతుంది.

6 సంవత్సరాల్లో లోన్‌ టెన్యూర్‌ ఎంచుకుంటే, మీరు నెలకు రూ. 11,590 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 1,91,510 & కారు మొత్తం ధర రూ. 8,34,510 అవుతుంది.

5 సంవత్సరాల్లో రుణం తీర్చేయగల స్థోమత ఉంటే, మీరు నెలకు రూ. 13,348 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 1,57,857 & కారు మొత్తం ధర రూ. 8,00,857 అవుతుంది.

4 సంవత్సరాల్లో రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, మీరు నెలకు రూ. 16,001 EMI చెల్లించాలి. ఈ ఆప్షన్‌లో, మొత్తం వడ్డీ రూ. 1,25,052 & కారు మొత్తం ధర రూ. 7,68,052 అవుతుంది.

కారు రుణ మొత్తం, వడ్డీ రేటు అంశాలు మీ క్రెడిట్ స్కోరు ఎంత బాగుందన్న విషయంపై ఆధారపడి ఉంటాయి. 

పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌
SUV సెగ్మెంట్‌లో, టాటా బ్రాండ్‌ నుంచి వచ్చిన చవకైన కారు టాటా పంచ్‌. రేటు తక్కువైనప్పటికీ స్టైల్, రక్షణలో ఎలాంటి రాజీ పడని కారు ఇది. ఇందులో 1.2 లీటర్‌ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది, ఇది 6000 rpm వద్ద 88.48 bhp పవర్, 113 Nm టార్క్‌ను జెనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో సౌకర్యవంతంగా ఉంటుంది, హైవే ఎక్కితే విశ్వరూపం చూపుతుంది. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో కూడిన ఈ కారు, చిన్న SUV లవర్స్‌కి మంచి ఎంపిక.

ఆకట్టుకునే సేఫ్టీ, టెక్నాలజీ ఫీచర్లు
టాటా పంచ్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS విత్ EBD, రియర్ పార్కింగ్ సెన్సర్లు వంటి భద్రత ఫీచర్లు అందించారు. ఇంకా.. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. 5 స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ అందుకున్న కారు ఇది. కాబట్టి, యువతతోపాటు, ఫ్యామిలీ పరంగానూ నమ్మకమైన కారుగా మారింది. స్టైల్‌, సేఫ్టీ, పనితీరు కలగలిపిన ఈ మినీ SUV, ప్రస్తుత మార్కెట్లో వేగంగా అమ్ముడవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget