అన్వేషించండి

Pure eV ePluto 7G Max: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కిలోమీటర్లు - ప్యూర్ ఈవీ ఈఫ్లూటో 7జీ మ్యాక్స్ వచ్చేసింది!

మనదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

Pure ePluto 7G Max: ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేసే భారతీయ కంపెనీ ప్యూర్ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 201 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కంపెనీ అందించనుందని కంపెనీ ప్రకటించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించారు. ఈ స్కూటర్ ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్, హీరో ఎలక్ట్రిక్‌లతో పోటీ పడనుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో హిల్‌స్టార్ట్ అసిస్ట్, డౌన్‌హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెనరేషన్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు అందించారు. దీని కోసం భారతదేశం అంతటా బుకింగ్ ప్రారంభం అయింది. అలాగే రాబోయే పండుగ సీజన్ నుంచి దీనికి సంబంధించిన డెలివరీ మొదలుకానున్నాయి. ఈ స్కూటర్‌ను మాట్ బ్లాక్, రెడ్, గ్రే, వైట్ అనే నాలుగు రంగులలో కొనుగోలు చేయవచ్చు.

ఇంజిన్ ఎలా ఉంది?
ఈ మోడల్ స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5 కేడబ్ల్యూహెచ్ హెవీ డ్యూటీ బ్యాటరీతో రానుంది. దీని మోటారు గరిష్ట శక్తి 2.4 కిలోవాట్లుగా ఉంది. CAN ఆధారిత ఛార్జర్‌తో ఈ బైక్ మార్కెట్లోకి రానుంది. మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

ఈప్లూటో 7జీ మ్యాక్స్‌లో ఏడు వేర్వేరు మైక్రో కంట్రోలర్లు, ఎన్నో సెన్సార్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఓటీఏ ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లను కూడా ఈ బైక్ పొందనుంది. అలాగే స్మార్ట్‌ఫోన్ల కంటే శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాలను కూడా ఇది పొందనుంది.

ప్యూర్ ఈవీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వధేరా మాట్లాడుతూ రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వినియోగదారులకు కూడా కోసం నిరంతరం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా చేయాలనుకుంటున్నామని తెలిపారు. కస్టమర్లకు అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ అందించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. కొత్త ఫీచర్ల గురించి మాట్లాడుతూ మాక్స్ బ్యాటరీలో స్టేట్ ఆఫ్ ఛార్జ్ (SOC), స్టేట్ ఆఫ్ హెల్త్ (SOH) కోసం ఏఐ ఎనేబుల్డ్ పవర్ డిశ్చార్జ్ అకౌంటింగ్‌ ఉండనుందన్నారు. ఇది బ్యాటరీ లైఫ్‌ను 50 శాతం వరకు మెరుగుపరుస్తుందని తెలిపారు. మోడల్ రైడింగ్ టెరెయిన్ ఆధారంగా ఇంటెలిజెంట్ థ్రోటిల్ రెస్పాన్స్‌ను కూడా కలిగి ఉందని పేర్కొన్నారు. ఇందులో స్మార్ట్ సెన్సార్లు కూడా అందించారు.

మెరుగు పడనున్న రైడింగ్ అనుభవం
పవర్‌ట్రెయిన్ సామర్థ్యంలో మెరుగుదల గురించి మాట్లాడుతూ రోహిత్ వదేరా మాట్లాడుతూ ‘బ్రేకింగ్ దూరం, బ్రేకింగ్ సమయం, రోలింగ్ వీల్ వేగం, బ్రేకింగ్ ఫోర్స్ పరంగా బ్రేకింగ్ అనుభవం గణనీయంగా మెరుగుపడింది. దీని ఫలితంగా ముందు, వెనుక బ్రేక్ లైఫ్ సైకిల్ 30 శాతం పెరిగాయి. ఇది రేంజ్, సేఫ్టీని పెంచడానికి కోటింగ్ రీజెన్‌తో సహా ఈఏసీ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ రీజెన్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంది.’ అన్నారు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
కొత్త Tata Punch EV కొనడానికి లోన్‌ ఎంత ఇస్తారు? తక్కువ EMI కోసం ఎన్నేళ్ల టెన్యూర్‌ ఎంచుకోవాలి?
2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?
ఫుల్‌ ఛార్జ్‌తో టాటా పంచ్ EV నిజంగా ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలుసా? అసలైన రేంజ్ ఇదే!
రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్‌కు పోటీగా కొత్త 'సింపుల్‌ వేవ్‌'.. రూ.1.10 లక్షలకే 243km రేంజ్!
బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ను బట్టి కాదు.. మీ ఆదాయానికి తగ్గట్లు ఎంత విలువైన కారు కొనాలో ఇలా లెక్కించండి!
మీ జీతానికి మీరు ఎంత ఖరీదైన కారు కొనవచ్చు?, సింపుల్‌గా ఇలా లెక్కించండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Konda Surekha: సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
Embed widget