అన్వేషించండి

New Yezdi Scrambler  Launch: అడ్వెంచర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 23న కొత్త యెజ్డీ స్క్రాంబ్లర్ లాంచ్! అదిరిపోయే అప్‌డేట్స్‌!

క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్‌ను భారీ మార్పులతో ఏప్రిల్ 23న విడుదల చేయనుంది. మెరుగైన సస్పెన్షన్, కొత్త కలర్ ఆప్షన్ల పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

New Yezdi Scrambler Set to Launch News: ఇండియ‌న్ మోటార్ సైకిల్ రంగంలో క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) తన హవాను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23, 2026న సరికొత్త యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) బైక్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. 2022 ప్రారంభంలో లాంచ్ అయిన తర్వాత ఈ బైక్‌కు జరుగుతున్న మొట్టమొదటి భారీ మార్పు ఇదే కావడం విశేషం. యెజ్డీ లైనప్‌లోని ఇతర మోడళ్లు ఇప్పటికే పలుమార్లు అప్‌డేట్ అయినప్పటికీ, స్క్రాంబ్లర్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ఇప్పుడు రాబోతున్న కొత్త వెర్షన్ ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించాలని కంపెనీ భావిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yezdi Motorcycles (@yezdiforever)

టెస్ట్ మ్యూల్స్ - ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్..
ఇప్పటికే ఈ కొత్త బైక్‌కు సంబంధించిన టెస్టింగ్ మోడళ్లు పలుచోట్ల రోడ్లపై కనిపించాయి. దీనిని బట్టి చూస్తే బైక్ వెనుక భాగంలో సస్పెన్షన్ సెటప్‌ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే ఎక్కువ ట్రావెల్ ఇచ్చేలా దీనిని రూపొందించారు. దీనివల్ల గతుకుల రోడ్లపై ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ఇవే కాకుండా లుక్స్ పరంగా కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉండబోతున్నాయి. యువతను ఆకట్టుకోవడానికి సరికొత్త రంగుల్లో (Fresh Colors) ఈ బైక్ కస్టమర్ల ముందుకు రానుంది.

ఇంజిన్ సామర్థ్యం - టెక్నికల్ డీటెయిల్స్..
మెకానికల్ విషయానికి వస్తే, యెజ్డీ స్క్రాంబ్లర్ తన పాత ఆల్ఫా 2 (Alpha 2) 334 సీసీ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో వచ్చే ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జత చేయ బడింది. పవర్ డెలివరీలో స్వల్ప మార్పులు చేసినా, కోర్ ఇంజిన్ మాత్రం అదే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. యెజ్డీ అడ్వెంచర్ ఇప్పటికే 2025 మధ్యలో అప్‌డేట్ అవ్వగా, తాజాగా రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ ఎడిషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.

650 సీసీ బిగ్ స్క్రాంబ్లర్ వస్తోందా?
టూవీలర్ మార్కెట్లో వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. బీఎస్ఏ (BSA) బ్రాండ్ నుండి పెద్ద కెపాసిటీ కలిగిన స్క్రాంబ్లర్ రాబోతోంది. ఇది బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 లో వాడే 650 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ స్టార్ స్క్రాంబ్లర్ వెర్షన్ అందుబాటులో ఉంది. భారత్‌లో కూడా దీనిని ప్రవేశపెడితే రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఎదురవుతుంది. క్లాసిక్ లెజెండ్స్ తన పోర్ట్‌ఫోలియోను నిరంతరం అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ 23న జరగబోయే ఈ లాంచ్ ఈవెంట్ ద్వారా స్క్రాంబ్లర్ ధర, పూర్తి ఫీచర్ల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget