Swift vs Wagon R: మారుతి స్విఫ్ట్-వాగన్ ఆర్‌లో మైలేజ్, ధరపరంగా ఏ కారును కొనడం లాభదాయకం?
Swift vs Wagon R: మారుతి స్విఫ్ట్, వాగన్ ఆర్ రెండూ మంచి మైలేజ్ ఇస్తాయి. 10 లక్షల లోపు ధర కలిగి ఉన్న ఈ రెండు వాహనాల్లో ఏది కొనడం లాభదాయకం?

Maruti Swift and Wagon R comparison: మారుతి సుజుకి కార్లు మంచి మైలేజీని అందిస్తాయి. అందుకే ఎక్కువ మంది ఈ వాహనాలు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కార్లు మంచి మైలేజీని అందించడం వల్లనే, ఈ బ్రాండ్ కార్లను నగరాల్లో నడపడానికి ఉపయోగిస్తారు. అయితే అయితే మారుతీలోనే లోబడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు న్నాయి. వాటిలో Maruti Swift, Wagon R రెండూ పోటీ పడుతుంటాయి. అయితే ఈ రెండు కార్లలో ఏది తీసుకుంటే మంచి మైలేజీతోపాటు తక్కువ నిర్వహణ ఖర్చు అవుతుంది. ఇతర ప్రయోజానాల్లో ఏమైనా తేడా ఉంటుందనే అనే విషయంపై ఇక్కడ చూద్దాం.
మారుతి స్విఫ్ట్(Maruti Swift )
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌లో అమర్చిన మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో, ఈ కారు 24.80 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. అదే సమయంలో, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు 25.75 kmpl మైలేజీని ఇస్తుంది. మారుతి స్విఫ్ట్ CNG 32.85 km/kg మైలేజీని ఇస్తుందని పేర్కొంది.
మారుతి వాగన్ ఆర్(Maruti Wagon R )
మారుతి వాగన్ ఆర్ 1197 cc ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 6,000 rpm వద్ద 66.9 kW పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండూ లభిస్తాయి. ఈ కారు పెట్రోల్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.35 kmpl మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 25.19 kmpl మైలేజీని ఇస్తుందని పేర్కొంది. CNGలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మారుతి వాగన్ ఆర్ 34.05 km/kg మైలేజీని ఇస్తుంది.
Also Read: నెలకు 30,000 రూపాయల జీతం వస్తున్న వాళ్లు ఎలాంటి కారు కొనవచ్చు? అత్యంత సరసమైన కార్ల జాబితా గురించి తెలుసుకోండి
Swift vs Wagon R ధరలో ఎంత తేడా?
Maruti Swift 12 వేరియంట్‌లలో మార్కెట్‌లో ఉంది. Maruti Suzuki ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5,78,900 నుంచి ప్రారంభమవుతుంది. Swift టాప్ మోడల్ Zxi+AGS ఎక్స్-షోరూమ్ ధర రూ.8,64,900. Maruti Swift భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా ఫీచర్ కూడా ఉంది.
Maruti Swiftతో పోలిస్తే Wagon R చౌకగా ఉంటుంది. Maruti Wagon R ఎక్స్-షోరూమ్ ధర రూ.4,98,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు 9 వేరియంట్‌లను మార్కెట్‌లో కలిగి ఉంది. పెట్రోల్, CNG రెండింటిలోనూ ఈ కారు లభిస్తుంది. Wagon R 9 రంగులలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. Wagon R కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్‌ను కలిగి ఉంది.





















