అన్వేషించండి

Electric Cars: దేశీయ మార్కెట్లో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! ధర కూడా తక్కువే!

భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో తక్కువ ధరకు లభించే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహణ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల వాహనదారులు మొగ్గు చూపుతున్నారు.  చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారీ వృద్ధిని సాధించాయి. అయితే, ఫోర్ వీలర్ సెగ్మెంట్ అనుకున్నంత స్థాయిలో అమ్మకాల్లో వేగం పుంజుకోవడం లేదు. అందుకు కారణం ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉండటం. అయితే, ప్రభుత్వ మద్దతుతో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లను సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రూ. 15 లక్షలలోపు ధరలో 300 కి.మీ కంటే ఎక్కువ పరిధి అందించే ఎలక్ట్రిక్ కార్లను ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. ఇంతకీ తక్కువ ధరలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుదాం..  

MG కామెట్ EV

MG కామెట్ EV అనేది మూడు-డోర్ల అర్బన్ ఎలక్ట్రిక్ సిటీ కారు. ఇది MG ZS EV తర్వాత MG మోటార్ ఇండియా నుంచి వచ్చిన రెండవ EV.  కామెట్ EV 25-kWh బ్యాటరీ ప్యాక్తో పాటు 50 kW మోటార్‌ను కలిగి ఉంటుంది.  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. MG కామెట్ EV ధర రూ. 8 లక్షలు ఉంది. ఇది భారత్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు.  ఈ కారు పలు లేటెస్ట్ ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

టాటా టియాగో EV

టాటా టియాగో EV  దేశంలో అత్యంత సరసమైన రెండవ ఎలక్ట్రిక్ కారు.దీని ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).  ఈ కారు నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో XE, XT, XZ+, XZ+ Tech LUX  ఉన్నాయి. ఒక్క ఛార్జ్ తో  315 కి.మీ ప్రయానం చేయవచ్చు. టియాగోలో ఎలక్ట్రిక్ మోటార్ 74 bhp పవర్ తో పాటు 114nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  

సిట్రోయెన్ C3 EV

భారత మార్కెట్లోకి వచ్చిన తొలి ఫ్రెంచ్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ C3.  ఇది మొదటి ఎలక్ట్రిక్ సబ్-కాంపాక్ట్ SUV కూడా. క్రూయిజ్ కంట్రోల్, రియర్ వైపర్, వాషర్,  ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి  ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది ఒక్క ఛార్జ్ తో 350 కిమీ ప్రయాణిస్తుంది. దీని మోటార్ 57 PS పవర్, 143nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  దీని ధర రూ. 11.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. భారత్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచింది.

టాటా టిగోర్ EV

టాటా నుంచి వచ్చిన మరో ఎలక్ట్రిక్ కారు టిగోర్ EV. ఈ కారు ధర 12.49 లక్షల రూపాయలుగా కంపెనీ ఫిక్స్ చేసింది.    ఒకే ఛార్జ్‌ పై 312 కి.మీ ప్రయాణాన్ని పొందవచ్చు. EV అప్పీల్ కోసం, వినియోగదారులను ఆకర్షించడానికి కారు టీల్ బ్లూ  రంగులను కలిగి ఉంటుంది.  టాటా టిగోర్ ఈవీ XE, XT, XZ+, XZ+ టెక్ LUX వేరియంట్లలో వస్తుంది.

టాటా నెక్సాన్ EV

టాటా నెక్సాన్ EV అనేది ప్రపంచంలోని మొట్టమొదటి హై-వోల్టేజ్ ఇండియన్ ఎలక్ట్రిక్ కారు. శంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది.  14.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ XM, XZ+, XZ + LUX వేరియంట్‌లలో వస్తుంది.  Nexon EV ప్రైమ్ యొక్క 30.2 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. మోటార్ 129 PS పవర్, 245 Nm టార్క్ ను అందిస్తుంది.  Nexon EV ప్రైమ్ ఒక్క ఛార్జ్ తో 312 కి.మీ ప్రయాణాన్ని అందిస్తుంది. 10 సెకన్లలోపు గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

Read Also: ఐదు ఎలక్ట్రిక్ కార్లు తీసుకురానున్న మహీంద్రా - ఎప్పటికి రానున్నాయంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Dina Sanichar Story In Telugu: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన
జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
Embed widget