Jaguar Land Rover: ఇండియాలో ల్యాండ్ రోవర్ కార్ల తయారీ - ఎక్కడో తెలుసా?
Jaguar Land Rover in India: మనదేశంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల తయారీ తమిళనాడులోని టాటా మోటార్స్ ప్లాంట్‌లో జరగనుందని తెలుస్తోంది.
Tata Motors New Plant for JLR: టాటా మోటార్స్ తమిళనాడులో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందులో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను తయారు చేయనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం టాటా మోటార్స్ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. టాటా మోటార్స్ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్చిలో తెలిపింది. అయితే కొత్త ప్లాంట్‌లో ఏయే కార్లను తయారు చేస్తారో కంపెనీ వెల్లడించలేదు.
టాటా మోటార్స్, జేఎల్ఆర్ భాగస్వామ్యం
ఈ కొత్త ప్లాంట్‌తో టాటా మోటార్స్, జేఎల్ఆర్ మధ్య భాగస్వామ్యం మరింత పెరుగుతోంది. రెండు కంపెనీలు కలిసి అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకాలు చేశాయి. జేఎల్ఆర్ ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫారమ్ కోసం ఈ ఎంవోయూ సంతకం చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను టాటా త్వరలో లాంచ్ చేయనున్న బోర్న్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగించనున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ మొదటి మోడల్ 2024 చివరిలో మార్కెట్లోకి రావచ్చు.
జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫారమ్
జేఎల్ఆర్ ఈఎంఏ ప్లాట్‌ఫారమ్ గురించిన సమాచారం 2021 సంవత్సరంలో షేర్ చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్ తదుపరి తరం వెలార్, ఎవోక్, డిస్కవరీ స్పోర్ట్‌లో చూడవచ్చు. జేఎల్ఆర్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌ను అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్), విస్తృతమైన క్లౌడ్ కనెక్టివిటీ, ఇతర కార్లతో కమ్యూనికేషన్ కోసం తీసుకువచ్చారు. జేఎల్ఆర్ తీసుకొస్తున్న ఈ కార్లలో అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై కూడా దృష్టి సారిస్తున్నారు.
భారతదేశంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాలు భారతదేశంలో బాగా అమ్ముడవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్ల అమ్మకాలు 81 శాతం పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ భారతదేశంలో 4,436 యూనిట్లను విక్రయించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ 2009లో భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుండి అమ్మకాల పరంగా కంపెనీకి బెస్ట్ ఇయర్ ఇదే.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?