Hyundai Offers: హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు - ఏకంగా రూ.43 వేల వరకు!
Hyundai: హ్యుందాయ్ కార్లపై కంపెనీ భారీ ఆఫర్లను అందించింది.
![Hyundai Offers: హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు - ఏకంగా రూ.43 వేల వరకు! Hyundai Offering Discounts on i20 Grand i10 Nios Aura Venue Models Check Details Hyundai Offers: హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు - ఏకంగా రూ.43 వేల వరకు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/05/432fe62079868f689bbd2689061cb5691707129358236456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyundai Car Offer: హ్యుందాయ్ తన వాహనాలపై బంపర్ ఆఫర్లను తీసుకొచ్చింది. హ్యుందాయ్ తన కార్లపై రూ.43 వేల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. కంపెనీ అందించే ఈ ఆఫర్లు మార్చి నెల వరకు మాత్రమే వర్తిస్తాయి. హ్యుందాయ్ విక్రయిస్తున్న ప్రముఖ వాహనాలపై ఈ ఆఫర్ అందిస్తున్నారు. ఈ వాహనాల్లో హ్యుందాయ్ ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, వెన్యూ మోడల్స్ ఉన్నాయి.
గ్రాండ్ ఐ10 నియోస్‌పై అత్యధిక తగ్గింపు (Hyundai Grand i10 Nios Offer)
హ్యుందాయ్ వాహనాల్లో అత్యధిక తగ్గింపు గ్రాండ్ ఐ10 నియోస్‌పై అందిస్తున్నారు. ఈ వాహనంపై రూ.43 వేల వరకు తగ్గింపు అందించనున్నారు. హ్యుందాయ్ దగ్గర ఉన్న ఈ మోడల్‌పై రూ.30 వేల నగదు తగ్గింపు ఇస్తున్నారు. ఈ మోడల్‌పై రూ. 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. హ్యుందాయ్ ఈ వాహనంపై రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా ఇస్తోంది.
ఆరా సబ్ కాంపాక్ట్ సెడాన్‌పై ఇలా... (Hyundai Aura Offer)
హ్యుందాయ్ యొక్క ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్‌పై కూడా గొప్ప ఆఫర్లు ఇవ్వబడుతున్నాయి. ఈ వాహనంపై కొనుగోలుదారులు రూ.33 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. హ్యుందాయ్ యొక్క ఈ మోడల్‌పై రూ. 20 వేల నగదు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ వాహనంపై రూ. 10 వేల ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో పాటు రూ. 3000 వేల కార్పొరేట్ తగ్గింపు కూడా ఇస్తోంది.
హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue Offer)
హ్యుందాయ్ వెన్యూ ఒక సబ్ కాంపాక్ట్ SUV. ఈ ఎస్‌యూవీపై హ్యుందాయ్ రూ.30 వేల వరకు తగ్గింపు ఇస్తుంది. వెన్యూపై రూ. 20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ వాహనంపై కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.48 లక్షల వరకు ఉంది.
హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ (Hyundai i20 Offer)
హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌పై కొనుగోలుదారులు రూ. 25 వేల వరకు లాభం పొందవచ్చు. ఈ వాహనంపై రూ.15 వేల నగదు తగ్గింపు, రూ.10 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్‌ను హ్యుందాయ్ అందిస్తోంది. అయితే ఈ మోడల్‌పై కార్పొరేట్ డిస్కౌంట్ కూడా లేదు. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్య ఉంది.
మరోవైపు జనవరిలో లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా ఇప్పటివరకు భారతదేశంలో 75,000 యూనిట్ల బుకింగ్ మార్కును కూడా అధిగమించింది. 2024 ఫిబ్రవరి ప్రారంభంలో 51,000 యూనిట్ల బుకింగ్‌ను దాటిన తర్వాత ఒక నెలలోపే కంపెనీ దాదాపుగా మరో 24,000 యూనిట్ల బుకింగ్‌లను నమోదు చేసింది. ఇది మాత్రమే కాకుండా భారతదేశంలో ఇప్పటివరకు హ్యుందాయ్ క్రెటా మొత్తం 10 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కూడా కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఏడు ట్రిమ్ లెవల్స్‌లో కొత్త క్రెటా మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఈ ఏడు వేరియంట్లలో కస్టమర్‌లు మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్‌లలో టాప్ స్పెక్ ఎస్ఎక్స్(వో) ట్రిమ్‌ను ఇష్టపడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)