Hyundai Creta ధర హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఎక్కడ తక్కువ? కొనేముందు తెలుసుకోండి! | Creta Price
Hyundai Creta Price Difference: క్రెటాను ప్రీమియం SUVగా మార్చడానికి దీనికి అనేక అత్యాధునిక ఫీచర్లను జోడించారు. కారు క్యాబిన్ కంఫర్ట్‌తో పాటు మోడర్న్ టెక్నాలజీ మిక్స్‌ను కూడా అందిస్తుంది.

Hyundai Creta Price in Hyderabad Vs Delhi Vs Bengaluru: భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా జనాదరణ పొందిన ఒక పాపులర్ SUV. ఎక్స్‌లెంట్ స్టైలింగ్, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌తో ఈ కారు బాగా ఫేమస్ అయింది. మీరు హ్యుందాయ్ క్రెటా SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ముందుగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ధరల్లో తేడాలు తెలుసుకోండి. క్రెటాను హైదరాబాద్ లేదా దిల్లీ లేదా బెంగళూరులో ఎక్కడ తక్కువ రేటుకు కొనవచ్చో తెలుసుకోండి. దీనికోసం ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.
ధర - హైదరాబాద్ Vs దిల్లీ Vs బెంగళూరు
హైదరాబాద్‌లో, హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 13 లక్షల 74 వేలు. బెంగళూరులో ఇదే మోడల్ ఆన్-రోడ్ రేటు రూ. 13 లక్షల 50 వేలు. దిల్లీలో ధర రూ. 12 లక్షల 88 వేలు. RTO (రిజిస్ట్రేషన్), కారు బీమా & ఇతర ఛార్జీల కారణంగా క్రెటా ధర నగరాన్ని బట్టి మారుతుంది. హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్‌ను హైదరాబాద్ కంటే బెంగళూరులో రూ. 24,000 తక్కువకే కొనవచ్చు. హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో ఏకంగా రూ. 86,000 తక్కువకే దక్కించుకోవచ్చు. హ్యుందాయ్ క్రెటాలో మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ప్రైస్ వేరియేషన్ మారిపోతుంది.
హ్యుందాయ్ క్రెటాలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
క్రెటాను ఒక ప్రీమియం SUVగా నిరూపించడానికి, హ్యుందాయ్ కంపెనీ ఈ కారులో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను యాడ్ చేసింది. కారులో కూర్చున్న వాళ్లకు ఒక లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా, కంపెనీ ఈ SUVని అత్యాధునిక సాంకేతికతతో కలిపి తయారు చేసింది. క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి, వీటితో డ్రైవింగ్ అనుభవం వేరే లెవెల్‌లో ఉంటుంది.
వాయిస్-యాక్టివేటెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణ. హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్ డిజైనింగ్‌కు తిరుగులేదని చెప్పవచ్చు. సీటింగ్ కెపాసిటీ కూడా గొప్పగా ఉంటుంది, లాంగ్ జర్నీల్లో కూడా ప్రయాణీకులు సౌకర్యవంతంగా ఫీలవుతారు. అలాగే, ఈ SUVలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ & వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మోడర్న్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా పవర్‌ట్రెయిన్
హ్యుందాయ్ క్రెటాను మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. అంటే, కస్టమర్ తన అవసరాలకు అనుగుణంగా సరైన పవర్‌ను ఎంచుకోవడానికి వీలుంది. ఇంజిన్ ఆప్షన్లలో మొదటిది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 115bhp పవర్‌ను & 144Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది, కారును కళ్లెం విడిచిన గుర్రంలా పరుగులు పెట్టిస్తుంది. రెండోది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 160bhp పవర్‌ను & 253Nm టార్క్‌ను అందిస్తుంది, కారును మరింత పవర్‌ఫుల్ వెహికల్‌గా మారుస్తుంది. మూడోది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 116bhp పవర్‌ను & 250Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
హ్యుందాయ్ క్రెటాలో అన్ని ఇంజన్లు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటాయి, కాబట్టి కస్టమర్ తన డ్రైవింగ్ స్టైల్ ప్రకారం సరైనదానిని ఎంచుకోవడానికి వీలవుతుంది.





















