హోండా కార్లపై భారీ ఆఫర్లు: సిటీపై రూ.1.33 లక్షలు, ఎలివేట్‌పై రూ.1.71 లక్షల వరకు డిస్కౌంట్
జనవరి 2026లో హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఎలివేట్‌పై రూ.1.71 లక్షలు, సిటీపై రూ.1.33 లక్షలు, అమేజ్‌పై రూ.65,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Honda January 2026 discounts: కొత్త ఏడాది ప్రారంభంలోనే కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి హోండా శుభవార్త చెప్పింది. జనవరి 2026 నెలకుగాను... Elevate, City, Amaze మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ లేదా స్వయం ఉపాధి బోనస్‌తో పాటు 7 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్ వారంటీపై ప్రత్యేక డిస్కౌంట్స్ ఇందులో ఉన్నాయి.
హోండా ఎలివేట్‌పై జనవరి 2026 ఆఫర్లు
హోండా ఎలివేట్‌లో టాప్ వేరియంట్ ZX (MY25) కొనేవాళ్లకు గరిష్ఠంగా రూ.1.71 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.45,000 ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ లేదా స్వయం ఉపాధి బోనస్, 7 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీపై రూ.19,000 తగ్గింపు ఉన్నాయి. అదనంగా 360 డిగ్రీ కెమెరా, అంబియంట్ లైటింగ్ వంటి యాక్సెసరీలపై కూడా తగ్గింపులు అందిస్తున్నారు.
MY26 ZX స్టాక్‌పై గరిష్ఠ డిస్కౌంట్ రూ.1.37 లక్షల వరకు ఉంటుంది. ఎంట్రీ లెవల్ SV వేరియంట్‌పై లాయల్టీ, స్క్రాపేజ్ బెనిఫిట్స్‌తో రూ.43,000 వరకు లాభం ఉంటుంది. V, VX వేరియంట్లలో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కలిపి మరింత లాభం పొందే అవకాశం ఉంది.
హోండా సిటీపై జనవరి 2026 ఆఫర్లు
హోండా సిటీపై ఈ నెలలో గరిష్ఠంగా రూ.1.33 లక్షల వరకు డిస్కౌంట్ ఉంటుంది. అన్ని వేరియంట్లకు రూ.20,000 వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ అందుబాటులో ఉంది.
SV, V, VX ఆటోమేటిక్ వేరియంట్లపై రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ లేదా స్వయం ఉపాధి బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీపై భారీ తగ్గింపులు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్లకు కూడా దాదాపు ఇదే తరహా ఆఫర్లు వర్తిస్తాయి.
ZX టాప్ వేరియంట్‌పై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. హోండా సిటీ ధర రూ.11.95 లక్షల నుంచి రూ.16.07 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. సిటీ హైబ్రిడ్ వేరియంట్‌కు ఎక్స్‌టెండెడ్ వారంటీపై రూ.17,000 తగ్గింపు మాత్రమే ఉంది.
హోండా అమేజ్‌పై జనవరి 2026 ఆఫర్లు
సెకండ్ జనరేషన్ హోండా అమేజ్‌పై రూ.65,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్, ఎక్స్‌టెండెడ్ వారంటీ తగ్గింపు ఇందులో ఉన్నాయి. ఈ వేరియంట్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.7.80 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
థర్డ్ జనరేషన్ అమేజ్‌లో ZX MT వేరియంట్‌పై గరిష్ఠంగా రూ.54,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. VX వేరియంట్లపై కూడా క్యాష్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. రెండు జనరేషన్‌ల అమేజ్‌కు రూ.20,000 వరకు స్క్రాపేజ్ బోనస్ కూడా వర్తిస్తుంది.
ఈ అన్ని ఆఫర్లు జనవరి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నగరం, స్టాక్ లభ్యత ఆధారంగా డిస్కౌంట్లు మారవచ్చు. కాబట్టి కార్ కొనుగోలు చేయాలనుకునేవారు తమ సమీప హోండా డీలర్‌ను సంప్రదించడం ఉత్తమం.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















