Flying Car: ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు వచ్చేసింది - ప్రయోగం సక్సెస్!
చైనీస్ ఏవియేషన్ సంస్థ ‘ఎక్స్ పింగ్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటిసారి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును సక్సెస్ ఫుల్ గా పరీక్షించింది. గంటలకు 130 కిలో మీటర్ల వేగంతో ఈ కారు ప్రయాణిస్తుంది.
రోడ్లపై రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో చైనీస్ ఏవియేషన్ సంస్థ సరికొత్త పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రజలను రోడ్ల మీద కాకుండా ఎగిరే కార్లలో ఆకాశమార్గాన తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ ను నివారించే ప్రయత్నంలో తొలి అడుగును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ XPeng రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీని దుబాయ్ వేదికగా టెస్ట్ చేసింది.
The first flight of the electric flying car XPENG X2 took place in Dubai. Its maximum speed is 129 km/h. The machine can rise to a height of up to 91 meters, has a parachute. There is also a remote control option. pic.twitter.com/7SXKXj3eOO
— Malinda 🇺🇸 🇺🇦 🇵🇱 🇨🇦 (@TreasChest) October 12, 2022
90 నిమిషాలు గగన విహారం
ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫ్లయింగ్ కార్ ప్రాజెక్టులపై ప్రయోగాలు జగుతుండగా.. ఒకటి అర మాత్రమే సక్సెస్ అయ్యాయి. వాటిలో ఈ కారు ఒకటి. తాజాగా ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని మనుషులు లేకుండా కంపెనీ పరీక్షించింది. సుమారు 90 నిమిషాల పాటు ఇది ప్రయాణించి, విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇది గంటకు 130 కి.మీ (80 మైళ్లు) గరిష్ట వేగాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇదే కారును జూలై 2021లో మానవ సహితంగా టెస్ట్ చేసి సక్సెస్ అయ్యింది.
ఇద్దరు ప్రయాణించే అవకాశం
సొగసైన డిజైన్ ను కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు ఇద్దరు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. ఎనిమిది ప్రొపెల్లర్ల సెట్ ద్వారా గాల్లోకి ఎగురుతుంది. విమానాలు, హెలికాప్టర్ల మాదిరిగా కాకుండా, Evto, ఎలక్ట్రిక్ వర్టికల్టేకాఫ్, ల్యాండింగ్ తో పాటు పాయింట్-టు-పాయింట్ వ్యక్తిగత ప్రయాణాన్ని అందిస్తాయి. ప్రజలు రోడ్డుపై కూడా నడపగలిగేలా ఆరవ జనరేషన్ ఎగిరే కారును కూడా Xpeng కంపెనీ రూపొందిస్తోంది.
దుబాయ్ లో ఎందుకు పరీక్షించారంటే?
ఈ సరికొత్త ఫ్లయింగ్ కారును దుబాయ్ లో టెస్ట్ చేయడానికి కారణం ఉంది. ఈ కారులో ప్రయాణించేది ఎక్కువగా ధనవంతులే అనే విషయాన్ని వెల్లడించే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్లు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రయాణీకులను రవాణా చేసే అవకాశం ఉంటుంది. బ్యాటరీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, మౌలిక సదుపాయాల సమస్యల ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Read Also: 2026లోగా మార్కెట్లోకి ఆర్‌ఎక్స్ 100 సరికొత్త మోడల్! యమహా కంపెనీ చైర్మెన్ కీలక ప్రకటన
ఫెరారీ, రోల్స్ రాయిస్ రేంజ్ ధర!
ఇక ఈ కార్ల ధరలను ఇంకా నిర్ణయించలేదని XPeng వైస్-ఛైర్మన్, ప్రెసిడెంట్ డాక్టర్ బ్రియాన్ గు వెల్లడించారు. ఫెరారీ, రోల్స్ రాయిస్, బెంట్లీ సహా పలు లగ్జరీ కార్లతో సమానమైన ధర ఉండొచ్చని వెల్లడించారు. త్వరలోనే వీటిని అంతర్జాతీయ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా Evtolపై స్పందించారు. అమెరికా, కెనడాలో ట్రయల్స్ ముగిసిన తర్వాత భారత్ లో eVTOL రూపంలో అర్బన్ ఎయిర్ మొబిలిటీని కలిగి ఉంటుందని వెల్లడించారు.