News
News
X

Best Cars Under 5 Lakhs: రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే - బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లు కూడా!

రూ.ఐదు లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఇవే.

FOLLOW US: 
Share:

Best Cars Under 5 Lakh in India: ప్రతి ఒక్కరూ తమ సొంత కారును కలిగి ఉండాలని కలలు కంటారు. కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల చాలా మంది కారును కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం రూ.ఐదు లక్షల లోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు చూద్దాం.

రెనో క్విడ్
రెనో నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ కారు 799 సీసీ ఉన్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 54 హెచ్‌పీ, 68 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు సీట్ల కారు. ఇది మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో రానుంది. ఇది 270 లీటర్ల బూట్ స్పేస్‌తో రానుకుంది. లేటెస్ట్ కార్లకు అవసరం అయిన దాదాపు అన్ని ప్రాథమిక ఫీచర్లను ఈ కారులో అందించారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షలుగా ఉంది.

మారుతీ ఆల్టో 800
మారుతి ఆల్టో 800 ప్రారంభ ధర రూ. 3.54 లక్షల నుంచి రూ. 5.13 లక్షలుగా ఉంది. ఈ కారు ఐదు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనితో పాటు సీఎన్‌జీ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఉన్న 799 సీసీ పెట్రోల్ ఇంజన్‌ని పొందుతుంది.

మారుతి ఈకో
మారుతి ఈకో భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్ STD 5 సీటర్ ధర రూ. 5.25 లక్షలుగా ఉంది. ఇక టాప్ మోడల్ అయిన ఏసీ CNG ధర రూ. 6.51 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 79.6 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో ఏడు సీట్ల ఆప్షన్ కూడా ఉంది.

మారుతి ఆల్టో కే10
మారుతి ఆల్టో కే10 998 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీనితో సీఎన్‌జీ కిట్ కూడా ఎంపికగా అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. వేరియంట్, ఇంధన రకాన్ని బట్టి ఆల్టో కే10 మైలేజ్ 24.39 kmpl నుంచి 33.85 km/kg వరకు ఉంటుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలుగా ఉంది.

మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో
మారుతి ఎస్ ప్రెస్సో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. దానితో పాటు సీఎన్‌జీ కిట్ ఆప్షన్‌తో కూడా రానుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండు ఆప్షన్లలోనూ అందుబాటులో ఉండనుంది. ఎస్ - ప్రెస్సో వేరియంట్ ఇంధన రకాన్ని బట్టి 24.12 kmpl నుంచి 32.73 km/kg మైలేజీని అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.64 లక్షలుగా ఉంది.

ఈ సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మన దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. జనవరిలో అన్ని బ్రాండ్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో కార్లు అమ్ముడుపోయాయి. అలాగే ఫిబ్రవరిలో కూడా కంపెనీల పనితీరు బాగానే ఉంది. ఈ నెలలో చాలా కార్ల కంపెనీలు అమ్మకాలలో సానుకూల వృద్ధిని సాధించాయి. 2023 ఫిబ్రవరిలో మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, ఎంజీ, టయోటా కంపెనీలు ఎక్కువ కార్లు విక్రయించిన కంపెనీల్లో టాప్ ఫైవ్‌లో ఉన్నాయి.

Published at : 03 Mar 2023 04:44 PM (IST) Tags: Auto News Maruti Suzuki Automobiles Best Cars Under Rs 5 Lakh

సంబంధిత కథనాలు

Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

New Car Care Tips: కొత్త కారు కొన్నారా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా షెడ్డుకి పోవడం ఖాయం!

New Car Care Tips: కొత్త కారు కొన్నారా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా షెడ్డుకి పోవడం ఖాయం!

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత