Luxury Cars Sales in India: ‘లగ్జరీ’ వైపు మొగ్గు చూపుతున్న భారత వినియోగదారులు - ఐదేళ్లలో గరిష్ట స్థాయికి!
భారతదేశంలో లగ్జరీ కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి.
Luxury Cars Sales in India: భారతదేశంలో వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిని చూపుతున్నారు. ఇది మాత్రమే కాకుండా దీని కోసం వారు సగటు ధర కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ప్రకారం, భారతదేశంలో లగ్జరీ వాహనాల ధర ఐదేళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయి విలువ పతనంతో పాటు సరుకు రవాణా, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం.
Mercedes-Benz, BMW, Audi, Volvo, Jaguar, Land Rover, Mini వంటి కంపెనీల లగ్జరీ వాహనాల వార్షిక సగటు 38 శాతం పెరిగింది. 2018లో ఇది రూ. 58 లక్షలు కాగా, 2023లో మొదటి నాలుగు నెలల్లోనే రూ. 80 లక్షలుగా నమోదైంది. లగ్జరీ కార్లను కొనుగోలు చేసే చాలా మంది కస్టమర్‌లు టాప్ ఎండ్ వేరియంట్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఏడాది మొదటి నాలుగు నెలల్లో సగటు రిటైల్ ధరలో తగ్గుదలని చూసిన మొదటి కంపెనీగా ఆడి ఇండియా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంలో ఆడీ సగటు రిటైల్ ధర రూ. 65 లక్షలు కాగా, ఈ ఏడాది కొంత లోటుతో రూ.63 లక్షలుగా ఉంది. భారతీయ ఆటో మార్కెట్‌లోని ప్యాసింజర్ వాహనాల విభాగంలో సెడాన్‌లు, ఖరీదైన SUVలు ప్రస్తుతం ఎంట్రీ లెవల్ వాహనాల కంటే మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి.
విజేతగా ల్యాండ్ రోవర్
ల్యాండ్ రోవర్ వాహనాలు అన్ని ఆటోమొబైల్ కంపెనీలలో అత్యుత్తమ వార్షిక సగటును కలిగి ఉన్నాయి. అంటే ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే రూ. 1.36 కోట్ల సగటును ల్యాండ్ రోవర్ సాధించింది. కాగా 2018లో ఇది రూ. 85.69 లక్షలుగా. తక్కువ వాహన విక్రయాలు ఉన్నప్పటికీ కంపెనీ సగటు రిటైల్ ధరలో మాత్రం పెరుగుదల నమోదు చేసింది. 2021లో కంపెనీ 1,954 యూనిట్లను విక్రయించగా... 2022లో 1,523 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల నిర్వహించిన ఆటోమేకర్స్ 2023 వార్షిక సమావేశంలో భవిష్యత్తులో రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాల గురించి సమాచారం ఇచ్చారు. టెస్లా కొత్త డిజైన్ కారుపై పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈ రెండు వాహనాలు సాంకేతికత పరంగా ప్రస్తుతం ఉన్న వాహనాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఎలాన్ మస్క్ ఈ వాహనాల గురించి సమాచారం ఇస్తున్న సమయంలోనే అతని వెనుక స్క్రీన్‌పై ఒక వాహనం టీజర్ ప్రొజెక్ట్ చేశారు. ఇది హ్యాచ్‌బ్యాక్ అని భావిస్తున్నారు. దీని గురించి ఎలాన్ మస్క్ కొంతకాలం క్రితమే ప్రకటించారు.
ఎలాన్ మస్క్ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి బిల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించారు. దీని కారణంగా ఎలాన్ మస్క్ కంపెనీ ప్రస్తుతం ప్రొడక్షన్ వెర్షన్‌ను సిద్ధం చేయడం ద్వారా ప్రోటోటైప్‌ను సిద్ధం చేస్తుందని భావిస్తున్నారు.
మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా కంపెనీ లైనప్‌లోని అన్ని వాహనాలతో పాటు రెండు కొత్త మోడళ్ల ఫోటోలను విడుదల చేయడం ద్వారా టెస్లా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో ఒక వాహనం డిజైన్ వ్యాన్ ఆకారంలో ఉంటుంది. మరొకటి సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ వంటిది. ఈ రెండు వాహనాలు చాలా పొదుపుగా ఉంటాయని భావిస్తున్నారు. తద్వారా కంపెనీ గరిష్ట యూనిట్లను విక్రయించగలదు. ఎలాన్ మస్క్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ రెండు వాహనాలు ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ యూనిట్లు తయారయ్యే అవకాశం ఉంది.