Best Selling Electric Cars: దేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు ఇవే - టాప్-5లో ఏం ఉన్నాయి?
Best Selling Hybrid Cars: ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల జాబితా బయటకు వచ్చింది. ఇందులో టాటా కంపెనీకి చెందిన కార్లు ఎక్కువగా ఉన్నాయి.
Best Selling Hybrid and Electric Cars: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు... రెగ్యులర్ ఐసీఈ కార్లకు ఎకో ఆల్టర్నేటివ్‌గా కనిపిస్తాయి. గత కొన్ని సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో అనేక రకాల హైబ్రిడ్ వాహనాలతో పాటు అనేక ఈవీలు లాంచ్ అయ్యాయి. కంపెనీలు వివిధ రకాల ఈవీలు, హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో వాటి సంఖ్య పెరగడం ఖాయం. ఇన్నోవా హైక్రాస్, గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్విక్టో, క్యామ్రీ వంటి మోడళ్లతో హైబ్రిడ్ కార్ల మార్కెట్లో మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్ అగ్రగామిగా ఉన్నాయి. కాబట్టి 2024 మొదటి త్రైమాసికంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.
టాప్ 5 సెల్లింగ్ హైబ్రిడ్ కార్లు
2024 మొదటి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకు), దేశంలో మొత్తం హైబ్రిడ్ కార్ల అమ్మకాలు 28,482 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో టయోటా ఇన్నోవా హైక్రాస్ 14,442 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో ఉండగా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 9,370 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. దీని తర్వాత మారుతి సుజుకి గ్రాండ్ విటారా 2,232 యూనిట్లతో మూడో స్థానం ఆక్రమించింది. ఇది టయోటా హైరైడర్‌కి రీ-బ్యాడ్జ్ వెర్షన్. మారుతి సుజుకి ఇన్విక్టో (రీ-బ్యాడ్జ్ అయిన ఇన్నోవా హైక్రాస్) 1,210 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అదే సమయంలో టయోటా క్యామ్రీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదో హైబ్రిడ్ కారు. దీని మొత్తం విక్రయాలు 754 యూనిట్లుగా ఉన్నాయి.
అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కార్లు
ఈవీ విభాగంలో టాటా మోటార్స్‌కు పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ వంటి ఉత్పత్తుల నుండి పోటీ లేదు. 2024 మొదటి త్రైమాసికంలో భారతీయ వాహన తయారీ సంస్థ టాటా 8,549 యూనిట్ల పంచ్ ఈవీని, 5,704 యూనిట్ల టియాగో ఈవీని, 4,223 యూనిట్ల నెక్సాన్ ఈవీని విక్రయించింది. ఈవీ విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు టాటా మోటార్స్ త్వరలో కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, సఫారి ఈవీలను పరిచయం చేయనుంది.
అదే సమయంలో అప్‌డేట్ చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 జనవరి 2024లో లాంచ్ అయింది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన నాలుగో ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. అయితే ఎంజీ అతి చిన్న ఎలక్ట్రిక్ ఆఫర్ కామెట్ 2024 జనవరి, మార్చి మధ్యలో 2,300 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?