అన్వేషించండి

Top 5 Hatchback Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!

Top 5 Hatchback Cars Under Rs 10 Lakh: బడ్జెట్ ధరలో మంచి హ్యాచ్‌బ్యాక్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే రూ.10 లక్షల్లోపు అందుబాటులో ఉన్న ఈ కార్లపై ఓ లుక్కేయండి!

Best Hatchback Cars Under Rs 10 Lakh: ప్రస్తుతం మనదేశంలో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. బడ్జెట్ ధరలో కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రూ.10 లక్షల్లోపు ధరలో మనదేశంలో మంచి హ్యాచ్‌బ్యాక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టాటా, హ్యుందాయ్, మారుతి కంపెనీలకు చెందిన కార్లు కూడా ఉండటం విశేషం. ఇందులో టాప్-5 కార్లు ఏవో చూద్దాం.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ (2024 Maruti Suzuki Swift)
2024 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో మార్కెట్లోకి వచ్చింది. కొత్త స్విఫ్ట్ 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ లీటరు పెట్రోలుకు 24.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అయితే 1.2 లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌లో, ఈ కారు లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)
హ్యుందాయ్ ఐ20 ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ కారులో 26.03 సెంటీమీటర్ల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు నావిగేషన్ సిస్టమ్ కూడా అందించారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.04 లక్షల నుంచి మొదలై రూ. 11.21 లక్షల వరకు ఉంది.

Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!

టాటా అల్ట్రోజ్ (Tata Altroz)
టాటా ఆల్ట్రోజ్‌కు సంబంధించి 32 వేరియంట్‌లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో యాంబియంట్ లైటింగ్‌ను టాటా అందించింది. ఈ టాటా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6,64,900 నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. ఈ కారుకు సంబంధించి 27 వేరియంట్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో ఎక్స్ షోరూమ్ ధర రూ. 5,64,900 నుంచి మొదలవుతుంది.

మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno)
మారుతి సుజుకి బలెనో ఏడు కలర్ వేరియంట్లలో మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ కారులో సెక్యూరిటీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. మారుతి సుజుకి బలెనోలో 360 డిగ్రీ వ్యూ కెమెరాను కూడా అమర్చారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.9.38 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

లిస్ట్‌లో ఉన్న ఈ ఐదు ప్రస్తుతం ఉన్న బెస్ట్ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లు అయితే... మరో మూడు ఎక్సైటింగ్ హ్యాచ్‌బ్యాక్‌లు కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయి. టాటా అల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer), సిట్రోయెన్ సీ3 టర్బో ఏటీ (Citroen C3 Turbo AT), హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ (Hyundai i20 N Line Facelift) మోడల్స్‌ను ఆయా కంపెనీలు త్వరలో లాంచ్ చేయనున్నాయి. ఈ కార్ల కోసం కూడా మనదేశంలో వెయిటింగ్ చాలా గట్టిగా ఉంది. 

Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget