Best CNG Cars in India: ఆఫీసుకు వెళ్లడానికి మంచి కారు కొనాలనుకుంటున్నారా? - బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే!
CNG Cars: మనదేశంలో ఆఫీసుకు వెళ్లడానికి చాలా మంది కార్లు ఉపయోగిస్తున్నారు. నగరాల్లో ఎక్కువ దూరాలు ప్రయాణించడానికి సీఎన్‌జీ కార్లు ఎక్కువ ఉపయోగపడతాయి. వాటిలో బెస్ట్ ఇవే!
Best CNG Cars for Office: భారతదేశంలో సీఎన్‌జీ కార్ల విక్రయం నిరంతరం పెరుగుతోంది. ప్రతిరోజూ ప్రయాణం చేసేవారు ఈ కార్లను ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే వారు సగటున రోజూ 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి. అటువంటి పరిస్థితిలో పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్‌జీ కార్లు చవకగా ఉంటాయి. మీరు కూడా చవకైన సీఎన్‌జీ కారు కోసం చూస్తున్నట్లయితే కొన్ని అత్యుత్తమ కార్ల గురించి తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)
వీటిలో మొదటి కారు మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్‌జీ. ఇది ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకైన సీఎన్‌జీ కారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.96 లక్షలుగా ఉంది. ఈ కారు భారీ ట్రాఫిక్‌ను కూడా సులభంగా దాటుతుంది. ఒక చిన్న కుటుంబానికి పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఈ కారులో నలుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
మారుతి సుజుకి ఆల్టోలో ఏసీ, ఫ్రంట్ పవర్ విండో, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
మారుతీ సుజుకి విటారా బ్రెజా (Maruti Suzuki Vitara Brezza)
మీ కోసం రెండో బెస్ట్ ఆప్షన్ మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ. మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ కార్లలో అత్యంత ఇంధన సామర్థ్య కారు. ఇది కేజీ ఇంధనానికి 34.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6.69 లక్షలుగా ఉంది. దీని రన్నింగ్ కాస్ట్ మోటార్ సైకిల్ రన్నింగ్ కాస్ట్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్. ఈ కారులో ఐదుగురు సులభంగా కూర్చోవచ్చు. సెక్యూరిటీ కోసం మీరు ఈ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్‌లను కూడా పొందుతారు.
టాటా టియాగో ఐసీఎన్‌జీ (Tata Tiago iCNG)
సీఎన్‌జీ కార్లలో మూడో ఉత్తమ ఆప్షన్ టాటా టియాగో ఐసీఎన్‌జీ. ఇది కేజీ ఇంధనానికి 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారులో ఐదుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు. కారు ఇంజన్ గురించి చెప్పాలంటే ఇందులో 1.2 లీటర్ ఇంజన్ ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73 హెచ్‌పీ పవర్, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్‌లో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అందిస్తారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
The @TataMotors Safari and Harrier has achieved Global NCAP’s Safer Choice Award, an accolade only available to automakers committing to the highest levels of safety performance for cars sold in India.
— GlobalNCAP (@GlobalNCAP) September 4, 2024
Read the full story here: https://t.co/OPi68SIKY7#SaferCarsForIndia pic.twitter.com/6vf4vLpGoU