అన్వేషించండి

Best Affordable Cars in 2023: 2023లో వచ్చిన బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే - ఒక ఈవీ మోడల్ కూడా!

Best Cars in 2023: మనదేశంలో ఈ సంవత్సరం కొన్ని బెస్ట్ బడ్జెట్ కార్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ఒక ఎలక్ట్రిక్ వాహనం కూడా ఉంది.

Best Budget Cars in 2023: 2023లో కార్ల తయారీ కంపెనీలు ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పాటు బడ్జెట్ ఎస్‌యూవీలపై కూడా చాలా శ్రద్ధ పెట్టారు. 2023లో ఈ విభాగంలో కొన్ని మంచి కార్లు భారతీయ మార్కెట్లో విడుదల అయ్యాయి. ఇప్పుడు ఇందులో బెస్ట్ మోడల్స్ చూద్దాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ లాంచ్ చేసిన అతి చిన్న ఎస్‌యూవీ ఎక్స్‌టర్. అయితే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ చాలా ఫీచర్లను కలిగి ఉంది. బాక్సీ లుక్స్‌తో పాటు ఇది సరికొత్త హ్యుందాయ్ డిజైన్ డిటైలింగ్‌ను కూడా పొందుతుంది. ఎక్స్‌టర్‌లో చాలా ఎక్కువ స్థలం అందుబాటులో ఉంది. ఏఎంటీ వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్‌లు ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇది సేఫ్టీ, గ్రౌండ్ క్లియరెన్స్, కంప్లీట్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా కూడా మంచి ఆప్షన్. దీని ప్రైస్ పాయింట్‌ను పరిగణనలోకి తీసుకుంటే పెట్టే డబ్బులకి మంచి విలువను అందిస్తుంది. ఈ కొత్త ఎక్స్‌టర్ 1.2 లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌తో లభిస్తుంది.

మారుతీ సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
దీని లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్న ఎస్‌యూవీగా ఇది మారుతి అందిస్తున్న ఉత్తమమైన ఆఫర్. దీని టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఇది చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. అయితే దీని ధర 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కంటే కొంచెం ఎక్కువ. దీని డిజైన్ మినీ గ్రాండ్ విటారా మాదిరిగానే స్టైలింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది చాలా విశాలమైన క్యాబిన్‌ను కూడా కలిగి ఉంది. ఏఎంటీ వేరియంట్‌లో వచ్చే 1.2 లీటర్ పెట్రోల్ చాలా బాగుంది. అధిక పనితీరు గల టర్బో పెట్రోల్ కూడా గొప్ప ఆప్షన్.

ఎంజీ కామెట్ (MG Comet EV)
చిన్న ఎంజీ కామెట్ కూడా చాలా ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ కారు. ఇది అత్యంత సరసమైన ఈవీ మాత్రమే కాకుండా భారతదేశంలోని అతి చిన్న కార్లలో ఒకటి కూడా. అయినప్పటికీ కామెట్ చాలా ఫీచర్లను కలిగి ఉంది. దీని సైజు చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ఇది చాలా స్థలంతో వస్తుంది. ఇక రేంజ్ గురించి చెప్పాలంటే కామెట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాని రన్నింగ్ ధర కూడా పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ కంటే చాలా తక్కువగా ఉండనుంది. సాధారణ కొత్త బడ్జెట్ కార్లలో కామెట్ చాలా భిన్నమైనది, చవకైనది కూడా.

హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో లాంచ్ చేయడానికి అనేక కొత్త కార్లను కలిగి ఉంది. కంపెనీ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 జనవరి 16వ తేదీన లాంచ్ చేయనుంది. దీని తర్వాత కంపెనీ అప్‌డేట్ చేసిన అల్కజార్, టక్సన్ ఎస్‌యూవీలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వీటితోపాటు హ్యుందాయ్ తన మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, క్రెటా ఈవీని కూడా ప్రదర్శిస్తుందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నారు. ఈ కారు చాలాసార్లు టెస్టింగ్‌లో కూడా కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి త్వరలో లాంచ్ చేయనున్న ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2024 ద్వితీయార్థంలో రానుంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Game Changer: ‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Game Changer: ‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!
US Attacks: అమెరికాలో వరుస ఉగ్రదాడులు - ట్రంప్ లెగ్గు పెట్టక ముందే అల్లకల్లోలం - విద్వేష రాజకీయాలే కారణమా?
అమెరికాలో వరుస ఉగ్రదాడులు - ట్రంప్ లెగ్గు పెట్టక ముందే అల్లకల్లోలం - విద్వేష రాజకీయాలే కారణమా?
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
సంధ్య థియేటర్ కేసులో కీలక మలుపు- నిర్మాతలతో కోర్టులో ఊరట- పోలీసులకు హక్కుల కమిషన్ నోటీసులు 
Embed widget