News
News
X

ఈ వారంలో ఈ రాశి వారు అదృష్ట వంతులు, పట్టిందల్లా బంగారమే

ఈ వారంలో ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం, వ్యాపార వృద్ధి, పనిలో విజయం, ఆర్థిక స్థితి బావుటుంది.

FOLLOW US: 
 

మేషరాశి

మేషరాశి వారు అనుకోకుండా సమస్యల్లో పడే ప్రమాదం ఉంది. వారసత్వంగా వచ్చే ఆస్తి కోసం తగాదాలు రావచ్చు. కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ఈరోజుల్లో అదృష్టం కలిసి రాకపోవడం వల్ల పనులు సకాలంలో పూర్తికావు. అందువల్ల మీరు అసహనంగా గడుపుతారు. అందుకే మీకు మీకోపం, మాట మీద తప్పకుండా అదుపు అవసరం. లేకపోతే మీ సంబంధ బాంధవ్యాలు చెడిపోవచ్చ. వ్యవసాయ దారులకు ఈ వారం ఆటు పోటులుగా ఉంటుంది. ఇదివరకు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చినప్పటికీ ఆ ధనం మార్కెట్ లో ఉండడం వల్ల సకాలంలో మీచేతికి అందక పోవచ్చు. అది మీ చింతకు కారణం కావచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. వాతంలో ఒక గొప్ప వ్యక్తిని కలుసుకుంటారు. వీరి వల్ల మీకు భవిష్యత్తులో చేసే పనుల్లో లాభం చేకూరవచ్చు. పోటి పరీక్షలు రాసిన విద్యార్థులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. లేదంటే దీర్ఘకాలం పాటు అవకాశాలకోసం వేచి చూడాల్సి రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామి ఫీలింగ్స్ అర్థం చేసుకొని మసలుకోవాలి. జీవిత భాగస్వామితో విబేధాలు రావచ్చు జాగ్రత్త. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధుల విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం: ప్రతి రోజూ హనుమాన్ చాలిసా చదువుకోవాలి. మంగళ వారం నాడు మైసుర్ పప్పు దానం చెయ్యాలి.

వృషభ రాశి

ఈ రాశి వారు ఈ వారం వచ్చే లాభం కంటే భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాన్ని గురించి కొంచెం జాగ్రత్త పడడం అవసరం. పనులను ఆటంక పరిచే వారి విషయంలో జాగ్రత్త. మీ ప్రయత్నాలను విరమించే ఆలోచన చెయ్యొద్దు. మీరు వ్యాపార నిర్ణయాలు చేసే సమయంలో మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మరచిపోవద్దు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి సమయం అంత బాగా లేదు. వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ బేధాలు రావచ్చు. వారం మధ్యలో సంతానానికి సంబంధించిన చింత మిమ్మల్ని వేధిస్తుంది. వారంతంలో వృత్తి వ్యాపార రీత్యా ప్రయాణావకాశాలు ఉన్నాయి. ప్రయాణంలో ఆరోగ్యం, మీ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఆవేశంగా మాట్లాడే మాటల వల్ల సంబంధ బాంధవ్యాల్లో అపార్థాలు రావచ్చు జాగ్రత్త. ప్రేమికులు సంభాషణల్లో జాగ్రత్త గా ఉండడం అవసరం. లేదంటే మీ మధ్య విబేధాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం బెంగగా ఉంటుంది.

పరిహారం: దుర్గా సప్తశతి చదువుకోవాలి. శుక్రవారం నాడు బాలికలకు పాయసం ప్రసాదంగా పంచాలి.

News Reels

మిథున రాశి

ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే సమయంలో మనసు, బుద్ధి రెండింటిని సమన్వయ పరిచి నిర్ణయం తీసుకోవాలి. ఆవేశంగానో, ఆనందంగానో ఎవరికీ ఎటువంటి మాట ఇవ్వడం మంచిదికాదు. డబ్బు లావాదేవిల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం. లేదంటే మీకు డబ్బు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఈ వారం అనవసరపు హడావుడి, వృథా ఖర్చులు కనిపిస్తున్నాయి. పనులు పూర్తి కాకపోవడం వల్ల చికాకు పెరుగుతుంది. మీ కష్టకాలంలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. వారం మధ్యలో ఒక గొప్ప వ్యక్తి సహాయ సహకారాలతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవడంతో కొంత ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఈ విషయంలో మీరు పూర్తిస్థాయిలో సఫలీకృతులు అవుతారు. ఎప్పటి నుంచో వ్యాపారం విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నవారికి ఆత్మీయుల సహకారంతో ఈ పని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సీనియర్లు, జూనియర్లు సహకరిస్తారు. ఉద్యోగాలు చేసే స్త్రీలకు ఇంటా బయట గౌరవం లభిస్తుంది. ఈ వారం మీకు లక్కీగా గడుస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. వివాహితులకు జీవితం సుఖప్రదంగా ఉంటుంది. చిన్నిచిన్న సమస్యలే అని అశ్రద్ధ చేస్తే ఆరోగ్యం పాడైపోవచ్చు.

పరిహారం: గణపతి చాలీసా చదువుకోవాలి. బుధవారం నాడు పెసరపప్పు దానం చెయ్యాలి.

కర్కాటక రాశి

ఈ వారం ఈరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంది. వ్యాపారస్తులకు వారం మొదట్లోనే మంచి లాభం కనిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. లగ్జరీ వస్తువుల కోసం డబ్బు కర్చుపెడతారు. రాజకీయ నాయకులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదవి లభిస్తుంది. గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, విదేశీ కెరీర్ గురించి ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభవార్తలు వింటారు. ఆస్తి తగాదాలు తీరుతాయి. కోర్టుల్లో తీర్పులు మీవైపే రావచ్చు. ఈ వారం ప్రయాణాలు, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి. దాంపతుల మధ్య మంచి సయోధ్య ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.

పరిహారం: ప్రతి రోజు శివలింగానికి ఇత్తడి పాత్రలో నీటితో అభిషేకం చేసుకోవాలి. ప్రతి రోజు శివ చాలిసా చదవాలి. సోమవారం రోజు బియ్యం లేదా పాలు దానం చెయ్యాలి.

సింహ రాశి

ఈవారం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలోనే మీ సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీకు మీ తండ్రిగారి సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కోరుకున్నఉద్యోగం లభిస్తుంది. ఇల్లు, భూమి లేదా వాహనం కొనాలన్న మీ చిరకాల వాంఛ తీరబోతోంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. వ్యాపారస్తులకు వారం మధ్యలో అప్రయత్న లాభం సిద్ధిస్తుంది. వివాదాల్లో సంపద చెతికి అందుతుంది. ధార్మిక, సాంఘిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. సంతాన సంబంధ శుభవార్త వింటారు. ఉద్యోగస్తులైన మహిళలకు విశేష లాభం చేకూరుతుంది. మీ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించి పెళ్లికి ఒప్పుకుంటారు. వివాహితులకు కుటుంబ జీవనం సుఖమయంగా ఉంటుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు అవసరం. పాత రోగాలు తిరగ బెట్టవచ్చు లేదా వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉండవచ్చు.

పరిహారం: ఉదయించే సూర్యునికి అర్ఘ్యం విడవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవాలి.

కన్య రాశి

అకస్మాత్తుగా దూరప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు. ఈ ప్రయాణం లాభాదాయకం కావచ్చు. వారం మద్యలో మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారంలో అత్యవసరమైన కొన్ని పనులు పూర్తిచెయ్యడం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బావుంటుంది. కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. గృహిణులకు ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడుపుతారు. వారాంతంలో అనుకోకుండా పెద్ద ఖర్చు రావడం వల్ల మీ బడ్జెట్ కింద మీద కావచ్చు. ఇంటి మరమ్మత్తులకు లేదా సామాగ్రికి ఎక్కువ ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. ఉద్యోగస్తులు సీనియర్లు, జూనియర్లను కలుపుకుని పనులు చక్కబెట్టుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఆచీతూచి అడుగెయ్యాలి. మీ చిన్న అజాగ్రత్త వల్ల మీకు చెడ్డపేరు రావడం మాత్రమే కాదు మీ ప్రేమ కూడా విఫలం అయ్యే ప్రమాదం ఉంది. జీవిత భాగ స్వామి ఆరోగ్యం గురించిన బెంగ ఉంటుంది.

పరిహారం: ప్రతి రోజు విష్ణు ఆరాధన, విష్ణుసహస్రనామ పారయణ చెయ్యాలి.

తులారాశి

ఈ వారం మీపనులు ఇతరులకు అప్పగించడం లేదా వాయిదా వెయ్యడం మంచిది కాదు. శత్రుబాధలు, అనారోగ్య బాధలు వారం మొదట్లో ఉంటాయి. ఆర్థిక లావాదేవిల్లో చాలా జాగ్రత్త అవసరం. వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు అంతకు మించి ఉంటాయి. వారం మధ్యలో ఏదైనా యాత్ర చేసే అవకాశం ఉంది. ఈ కాలం ఉల్లాసంగా గడుపుతారు. పోయిన వారం చేసిన ముఖ్యమైన పనుల ఫలితాలు ఇప్పుడు మీరు పోందుతారు. ఈ వారం మీరు ఆచితూచి అడుగెయ్యాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే మనుషుల నుంచి దూరంగా ఉండడం అవసరం. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారం: అమ్మవారిని కొలుచుకోవాలి, శ్రీ సూక్తం చదువుకోవాలి.

వృశ్చిక రాశి

ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ధన ప్రాప్తి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థిక స్థితి బావుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇంట్లో చిన్న చిన్న గొడవల్లో తల్లిదండ్రుల సహకారం లేకపోవడం వల్ల కొంత చికాకుగా ఉంటారు. పనుల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి కష్ట సమయంలో మీ ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. వారాంతంలో మీ పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో కెరీర్ ప్లాన్ చేస్తున్న వారికి ఆటంకాలు తొలగి పోయి మార్గం సుగమం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మీ భాగస్వామిపై నిర్లక్ష్యం తగదు. దాంపత్యంలో దంపతుల మధ్య సఖ్యత బావుంటుంది.

పరిహారం: హనుమంతుని ఆరాధన హానుమాన్ బాణ పఠనం చెయ్యాలి. మంగళ వారం హనుమంతునికి సింధూరం పెట్టించాలి.

ధనస్సు రాశి

పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వీటిని దాటేందుకు అందరిని కలుపుకుపోవడం అవసరం. విజయం కోసం కఠోర శ్రమ చెయ్యాల్సి ఉంటుంది. ఎన్నో చింతల తర్వాత మీకు చాలా ఆర్థిక అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ వాటిని సమయానుసారం అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. వారం ప్రారంభం కంటే వారంతం బావుంటుంది. వ్యాపార విషయంగా ప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టుల్లో తీర్పులు మీ పక్షాన వస్తాయి. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లవచ్చు కూడా. వివాహితులకు జీవితం ఆనందంగా గడుస్తుంది.

పరిహారం: ఉదయించే సూర్యునికి అర్ఘ్యం విడవాలి. విష్ణుసహస్రనామ పారాయణం చెయ్యాలి.

మకర రాశి

మీరు ఈ వారం మీ బుద్ధి కుశలతను ఉపయోగించి ఒక పెద్ద సమస్య పరిష్కారం చేస్తారు. ఉద్యోగస్తులు అందరిని కలుపుకుని పనులు చక్కబెట్టుకుంటారు. పోటి పరీక్షలకు సిధ్ధమవుతున్న విద్యార్థులు శుభవార్త వింటారు. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త. వ్యాపారంలో ఉన్నవారికి గట్టి పోటి ఎదురు కావచ్చు. సమయానికి భోంచెయ్యడం, నిద్ర పోవడం మంచిది. లేకపోతే అనారోగ్యం కలుగవచ్చు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆత్మీయుల సలహా పాటించడం అవసరం. జీవిత భాగ స్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి

పరిహారం: హానుమాన్ ఆరాధాన, హనుమామాన్ చాలీసా చదువుకోవడం మంచిది. శనివారం రోజు రావి చెట్టు కింది ఆరుముఖాల దీపి వెలిగించాలి.

కుంభ రాశి

ఈవారం కుంభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక బాధలు తప్పవు. వారం ప్రారంభంలో ఇల్లు స్థలాల కోసం అనవసరపు ఖర్చు మాత్రమే కాదు శ్రమ కూడా ఎక్కువ అవుతుంది. వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యం కలుగవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో తప్పనిసరిగి ఆర్థిక అంశాల్లో క్లియర్ గా ఉండడం అవసరం. వారం మధ్యలో సోదర సోదరిలతో వాగ్వాదం వల్ల మనసు బాధ పడవచ్చు. ఇంట్లోని చికాకులు పని మీద కూడా ప్రభావం చూపవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం. ఆవేశంలో మాట తూలడం, నిర్ణయాలు తీసుకోవడం కూడదు. వారంతంలో మీకు సమయం అనుకూలించవచ్చు. గొప్ప వ్యక్తి కలుగజేసుకోవడం వల్ల లాభాన్ని పొందుతారు. వ్యాపారం కూడా బావుంటుంది. అయినవాళ్లతో ఉన్న అభిప్రాయ బేధాలు తొలగి పోతాయి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మీ కష్ట కాలంలో మీ ప్రియతముల సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితం బావుంటుంది.

పరిహారం: ప్రతి రోజు హనుమాన్ ఆరాధన చేసుకోవాలి. శనివారం రోజు సాయంత్రం శని ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి. శని సంబంధ వస్తువుల దానం చెయ్యాలి.

మీనరాశి

మీన రాశి వారు ఇతరులను ఆటపట్టించే విషయంలో జాగ్రత్తగా మసలు కోవాలి. అది అభిప్రాయ బేధాలకు కారణం కావచ్చు. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. నిరుద్యోగులు మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే. వ్యాపారం విస్తరించే విషయంలో ఆత్మీయుల సలహా తీసుకోవాలి. వారం మధ్యలో విలాసాలకు ఖర్చు చేస్తారు. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమను తెలియజేయాలనుకునే వారికి ఇది సరైన సమయం కాదు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఫర్వాలేదు. జీవితభాగ స్వామి ఆలోచనలకు విలువనివ్వడం అవసరం.

పరిహారం: స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చెయ్యాలి. రోజూ విష్ణుసహస్రనామ పారాయణం చెయ్యాలి.

Also Read: నాగుల చవితి పుట్టలో పాలుపోసే ముహూర్తం వివరాలు, పుట్ట దగ్గర చేయాల్సిన ప్రార్థన!

Published at : 31 Oct 2022 07:26 AM (IST) Tags: Weekly Horoscope predictions all zodiac signs

సంబంధిత కథనాలు

Geetha Jayanthi2022:  ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఇవి తెలుసుకుంటే భగవద్గీత చదివినట్టే

Geetha Jayanthi2022: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి

Geetha Jayanthi2022:  ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే  మార్గదర్శి

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

టాప్ స్టోరీస్

Janasena Slow : జోరుగా ప్రచారాలు - అభ్యర్థులపై కసరత్తులు, ఎన్నికకు సిద్ధం అయిన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ! జనసేన వెనుకబడిందా ?

Janasena Slow : జోరుగా ప్రచారాలు - అభ్యర్థులపై కసరత్తులు, ఎన్నికకు సిద్ధం అయిన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ! జనసేన వెనుకబడిందా ?

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్