అన్వేషించండి

Weekly Horoscope: ఆగస్టు 1 నుంచి 7 వరకూ ఈ వారం రాశిఫలాలు

ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకూ ఈ వారం రాశిఫలాలు ఎలాఉన్నాయి...ఏ రాశివారు ఆకట్టుకుంటారు..ఏ రాశి వారు వివాదాల్లో చిక్కుకుంటారు...ఏఏ రాశుల వారిని విజయలక్ష్మి వరిస్తుంది.... ఎవరెవరికి ఇబ్బందులు తప్పవు...

మేషం

మేషరాశివారికి ఈవారం బావుంటుంది. అందర్నీ ఆకట్టుకుంటారు. ఏ విషయంలోనూ పరధ్యానంగా ఉండొద్దు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఈ వారం బంధువులను కలుస్తారు. ఆలయానికి వెళ్లి దానధర్మాలు చేయండి. అపరిచితుల సహాయం అస్సలు తీసుకోకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులు కష్టపడాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. సంపాదన మార్గాలు వెతుక్కుంటారు.

వృషభం

ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీ పనిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన మీ పని పూర్తవుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.స్నేహితుల అండ ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి, పిల్లలతో సంతోషంగా ఉంటారు.

మిథునం

మిధున రాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలయాల సందర్శన ఉంటుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించగలుగుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అనవసర ప్రయాణాలు చేయొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

 

కర్కాటక రాశి

 ఈ వారం ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఒకరి సహాయంతో, మీ పెండింగ్ పని పూర్తవుతుంది. ఈ ఏడు రోజులూ బిజీ బిజీగా ఉంటారు. ఆర్థిక సమస్యలుంటాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. కొత్త సమాచారం అందుబాటులో ఉంటుంది. కార్యాలయంలో సవాళ్లు ఉంటాయి. ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. తెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఈ వారం మీరు శుభవార్త వింటారు.


Weekly Horoscope: ఆగస్టు 1 నుంచి 7 వరకూ ఈ వారం రాశిఫలాలు

సింహం

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఓ పని ఈ వారంలో పూర్తవుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. అనవసర మాటలు వద్దు. కుటంబ సభ్యుల అంగీకారం, సలహా లేకుండా ఏ పనీ చేయొద్దు. బంధువులను కలుస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు పొందండి. వ్యాపారవేత్తలు తమ పలుకుబడిని కాపాడుకోవాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.

కన్య

కన్యా రాశివారికి ఈ వారం ఉద్యోగ మంచి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. సంపద సృష్టిస్తారు. స్థిరాస్తి పెరుగుతుంది. ఈ వారం మీ అదృష్టం బావుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

తులారాశి

ఈ వారం ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి. వ్యాపారస్తులు పనులు పూర్తిచేసుకుంటారు. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు దక్కుతుంది. బంధువుల నుంచి ఆహ్లదకరమైన సమాచారాన్ని పొందుతారు. కుటంబంతో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికరాశి

వృశ్చికరాశి వారికి ఈ వారం చాలా బావుంటుంది. శుభవార్త అందుకునే అవకాశం ఉంది. కుటుంబంతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు. ఏపనీ వాయిదా వేయొద్దు. మీ సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. అవసరమైన వారికి సహాయం చేస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మతపరమైన ప్రయాణం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మద్దతు ఎల్లవేళలా ఉంటుంది.

ధనుస్సు

ధనస్సు రాశివారికి ఈవారం కలిసొస్తుంది. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు అడుగులు ముందుకేస్తారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలుంటాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. కొత్త పని ప్రయోజనకరంగా ఉంటుంది. మీ దినచర్యలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించండి.


Weekly Horoscope: ఆగస్టు 1 నుంచి 7 వరకూ ఈ వారం రాశిఫలాలు

మకరం

ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు...మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. సహోద్యోగుల నుంచి ఈ వారం వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆర్థికంగా కొంత నష్టపోతారు. ఒత్తిడిని తొలగించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.

కుంభం

ఈ వారం పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తచేయండి. ఈ వారం ధానధర్మాలు చేస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. రుణం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మీనం

ఆర్థిక పురోగతి కోసం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. యువత విజయం సాధిస్తుంది. మంచి ప్రవర్తనతో ప్రసంశలందుకుంటారు. అధిక పని మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రావొచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ నైపుణ్యంతో...చాలా మంది వ్యక్తుల పని పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండండి.

 

నోట్-  ఓ రాశిలో ప్రస్తాలించిన ఫలితాలు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయని భావించవద్దు. వారి వారి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మారుతాయి. పూర్తిస్థాయి వ్యక్తిగత ఫలితాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుడిని సంప్రదించగలరు..

టాప్ హెడ్ లైన్స్

07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget