అన్వేషించండి

సెప్టెంబర్ 24, 2025 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Daily Horoscope in Telugu: 2025 సెప్టెంబర్ 24న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025  సెప్టెంబర్ 24 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 24th 2025 

మేష రాశి

ఈ రోజు మీకు కొన్ని సమస్యలతో నిండి ఉంటుంది. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది... భాగస్వామి పట్ల జాగ్రత్తగా ఉండండి. మాటలను అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో ఒక బాధాకరమైన వార్త అందుతుంది.

శుభ సంఖ్య: 5, 14
రంగు: ఎరుపు
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

వృషభ రాశి
 
ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మంచిరోజు అవుతుంది. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పూర్వీకుల ఆస్తిలో ఈ రోజు మీకు హక్కు లభించవచ్చు.

శుభ సంఖ్య: 2, 9 
రంగు: పసుపు
పరిహారం: శివలింగానికి పూజ చేయండి 

మిథున రాశి

ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి..లేకపోతే  మీ ప్రత్యర్థుల కుట్రకు గురవుతారు. పని ప్రదేశంలో అధికారులతో అనవసరమైన వాగ్వాదం పెరగవచ్చు. వ్యాపారంలో సహచరులు మిమ్మల్ని వదలి వెళ్లిపోతారు. కుటుంబంలో పిల్లల ఆరోగ్యం క్షీణించినట్టు అనిపిస్తుంది.
 
శుభ సంఖ్య: 3, 7 
రంగు: ఆకుపచ్చ 
పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.

కర్కాటక రాశి
 
ఈ రోజు మీరు ఏదైనా పెద్ద పనిని ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో మీరు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు..ఈ కారణంగా భారీగా లోన్ కోసం తిరగాల్సి వస్తుంది. ఈ రోజు బావుంటుంది. మీరున్న రంగంలో విజయం సాధ్యం అవుతుంది. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. కుటుంబంలో సాగుతున్న వివాదం ముగుస్తుంది.
 
శుభ సంఖ్య: 4, 8 
రంగు: తెలుపు 
పరిహారం: రుద్రాష్టకం పారాయణం చేయండి 

సింహ రాశి

ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. పని ప్రదేశంలో మీ సహచరులతో విభేదాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులు - జీవిత భాగస్వామి మధ్య వాగ్వాదం ఏర్పడవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోండి.

శుభ సంఖ్య: 1, 6 
రంగు: నారింజ 
పరిహారం: నారాయణ కవచం పారాయణం చేయండి 

కన్యా రాశి

ఈ రోజు మీరు ఒక నిర్దిష్ట పని బాధ్యతను పొందుతారు కానీ ప్రత్యర్థులు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

శుభ సంఖ్య: 5, 10 
రంగు: లేత నీలం 
పరిహారం: గణపతి అధర్వశీర్ష పారాయణం చేయండి 

తులా రాశి

ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు..ఇందులో తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారంలో  బంధువులు ,  స్నేహితుల నుంచి  పెద్ద ఆర్థిక సహాయం లభిస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.  

శుభ సంఖ్య: 2, 8 
రంగు: గులాబీ 
పరిహారం: నవరాత్రుల్లో బాలలకు పూజ చేయండి

వృశ్చిక రాశి

ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనికి పునాది వేయవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో నూతన బాధ్యతలు పొందుతారు. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఒక మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు.

శుభ సంఖ్య: 3, 9 
రంగు: ఎరుపు 
పరిహారం: హనుమాన్ ప్రార్థన చేయండి
 
ధనుస్సు రాశి
 
ఈ రోజు సమస్యలతో నిండి ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు కొంత ఇబ్బంది పడవచ్చు. మీ జీవిత భాగస్వామితో అంతర్గత విభేదాలు పెరగుతాయి.  వ్యాపారంలో పెద్ద నిర్ణయం తీసుకోకండి.  వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.

శుభ సంఖ్య: 6, 12 
రంగు: నీలం 
పరిహారం: శివ చాలీసా పారాయణం చేయండి.

మకర రాశి

ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది.అయితే కుటుంబంలో సామరస్యత లోపించడం వల్ల కొన్ని చికాకులుంటాయ్
 
శుభ సంఖ్య: 4, 11 
రంగు: ఆకుపచ్చ
పరిహారం: సుందరకాండ పారాయణం చేయండి
 
కుంభ రాశి
 
ఈ రోజు మీరు ఏదైనా కొత్త పని కోసం బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆంటకాలు ఎదురైనా చేపట్టిన పని పూర్తవుతుంది. పాతవివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 
 
శుభ సంఖ్య: 1, 7 
రంగు: తెలుపు 
పరిహారం: లింగాష్టకం పారాయణం చేయండి
 
మీన రాశి 

ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది. పాత పెద్ద వివాదాన్ని పరిష్కరించడంలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి. కుటుంబంలో సామరస్యత లోపించవచ్చు.  

శుభ సంఖ్య: 5, 10 
రంగు: పసుపు 
పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయండి 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Advertisement

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget