అన్వేషించండి

శని తిరోగమనం, నవంబర్ వరకు ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే!

శని కర్మకారకుడు. మనం చేసిన కర్మలకు తగిన ఫలితాలను అందించే న్యాయాధీశుడు. ఆయన దృష్టి సరిగ్గా లేకపోతే జీవితాలు తల్లకిందులవుతాయి. అలాంటి శని వక్రగతి కొందరికి కలిసి రాబోతోందట.

జ్యోతిష్యంలో ఒకనిర్ధుష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కొంత కాలం పాటు తిరోగమనంలో ఉంటుంది. గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని. మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు అని కూడా అంటారు. తిరోగమన స్థితిలో శని కాస్త బలహీన పడతాడు కూడా. అందువల్ల సరైన ఫలితాలను ఇవ్వలేడు. శని శుభస్థితిలో ఉంటే ఆనందం, శాంతి వంటి మంచి ఫలితాలు ఉంటాయి. శని కర్మ ప్రదాత. ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది. అటువంటి శని ఈ ఏడాది జూన్ 17 న కుంభరాశిలోనే తిరోగమనం మొదలైంది. ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాశులకు సమయం అనుకూలంగా ఉండదు. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. జూన్ 17 నుంచి నాలుగు నెలల పాటు శని తిరోగమనంలో ఉంటాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఆరాశుల వారు చాలా మంచి ఫలితాలు సాధించి విజయపథంలో సాగబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

మకర రాశి

శని తిరోగమనంలో ఉండడం వల్ల మకరరాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. ఈ సమయంలో మకరరాశి వారు ఆర్థికంగా బలపడతారు. బ్యాంక్ బాలెన్స్ పెరుగుతుంది. ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ వైవాహిక జీవితంలో సారుకూలత కనిపిస్తుంది. మనసు ఆనందంగా ఉంటుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి శని తిరోగమన కాలం విశేష ఫలితాలను ఇవ్వబోతోంది. పనిచేసే చోట మంచి ప్రశంశలు అందుకుంటారు. ఉన్నత స్థాన్నాన్ని పొందుతారు. మీ మాట తీరుతో చాలా మందిని ఆకట్టుకుంటారు. అదృష్టం పూర్తి స్థాయిలో వీరి వైపు ఉంటుందని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కొన్ని కొత్త విషయాలను ఆవిష్కరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు  ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభ రాశి

శని వక్రగతి వృషభరాశి వారికి చాలా యోగదాయక కాలం. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మాట మీద కాస్త అదుపు మాత్రం అవసరం. పనిచేసే చోట సహోద్యోగుల సహకారం దొరుకుతుంది. ఈ సమయంలో పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. పెద్ద ప్రాజెక్టుల్లో భాగం వల్ల లాభాలు పొందుతారు. వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ధన లాభం తప్పకుండా ఉంటుంది.

ఇక శని వక్రమార్గంలో ఉండడం వల్ల కాలం కలిసి రాని జాతకులు ప్రతి రోజూ శనిబీజ మంత్రం, తాంత్రిక శని మంత్రం ప్రతి రోజూ పఠించడం వల్ల శని వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించే శక్తిని పొందవచ్చు. అవసరంలో ఉన్న వారికి సాయం చెయ్యడం, పశుపక్ష్యాదుల పట్ల దయకలిగి ఉండడం వాటి ఆకలి తీర్చడం వంటివన్నీ కూడా శని ప్రతికూలతలను నివారిస్తాయి. ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని ప్రభావాలు ఉపశమిస్తాయి.

Also read : Bamboo plant: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? దీన్ని ఎలా పెంచాలి?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget