News
News
వీడియోలు ఆటలు
X

మే 7 రాశిఫలాలు, ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటూ శత్రువులను గమనిస్తూ ఉండాలి

Rasi Phalalu Today 7th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మే 7 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారికి ఈ రోజు బాగా ప్రారంభమవుతుంది.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత కొత్త పనులు ప్రారంభించవద్దు. ఈ రోజు కొంత గందరగోళం ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. మాటతీరుపై సంయమనం పాటించాలి. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రత్యర్థులపై నిఘా పెట్టాలి. కెరీర్లో సక్సెస్ అవడానికి ఈ రోజు మంచిరోజు. 

వృషభ రాశి

వ్యాపారంలో కీర్తి, ఆదాయం రెండూ దక్కించుకుంటారు. ఈ రాశి ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. మీకు ప్రియమైన వారిని కలవడం వల్ల ఆనందంగా ఉంటారు. ఇంటికోసం అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. 

మిథున రాశి

ఈ రోజు మీకు కొన్ని ప్రత్యేక చర్చలతో కాలం గడిచిపోతుంది. ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీరు శత్రువుల ముందు విజయం సాధిస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.

Also Read: కుజుడు-శుక్రుడు సంయోగం, ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!

కర్కాటక రాశి

ఈ రాశివారు ఈరోజు చిరాకుగా ఉంటారు. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఉద్యోగులు వ్యాపారులకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మధ్యాహ్నం తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

సింహ రాశి 

ఈ రోజు వ్యాపారం లేదా ఉద్యోగం పనిమీద ప్రయాణం చేస్తారు.  ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ధనలాభం ఉంటుంది. కొత్త పనులకు మంచి సమయం. మీరు ఏదైనా లాభదాయకమైన పెట్టుబడిపై ఆసక్తి చూపవచ్చు. రోజంతా సహనంతో ఉంటారు. మానసిక చికాకులు తగ్గుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది.  భూమి, ఆస్తికి సంబంధించిన సమస్యలు కొలిక్కి రావచ్చు.

కన్యా రాశి

ఈ రోజు మీ మనసులో కొంత సందిగ్ధత ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. మౌనంగా ఉండడం మీకు చాలామంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. సన్నిహిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితి బావుంటుంది.

Also Read: వృషభంలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితాల్లో వెలుగొస్తుంది

తులా రాశి

ఈ రోజు కష్టమైన పనిని సులభంగా చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆలోచనలో  దృఢత్వం ఉంటుంది. వినోదం కోసం ఖర్చులు చేస్తారు.నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. అహంకారం తగ్గించుకుంటే మీకే మంచిది. 

వృశ్చిక రాశి

మీ కోప ప్రవర్తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. స్నేహితులు బంధువులతో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక విషయాలతో జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు.

ధనుస్సు రాశి

వ్యాపారానికి ఈరోజు లాభదాయకమైన రోజు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. స్నేహితులతో కలసి బయటకు వెళతారు. వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండాలి.

మకర రాశి

ఈ రోజు ఈ రాశి వివాహితులు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు మద్దతు లభిస్తుంది. స్నేహితులను కలుస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పర్యటనలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కుంభ రాశి

ఈ రోజు సాహిత్య కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. మతపరమైన ప్రయాణాలు చేస్తారు.  వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మధ్యాహ్నం తర్వాత కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

మీన రాశి

ఈ రాశివారు రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. స్నేహితులు, ప్రియమైనవారినుంచి మంచి సమాచారం అందుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో విశేష లాభం పొందుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి.

Published at : 07 May 2023 05:35 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 7th May 7th May Astrology

సంబంధిత కథనాలు

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్ట‌త‌ తెలుసా!

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

టాప్ స్టోరీస్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!