News
News
X

Horoscope Today 4th March 2023: మార్చి 4, ఈ రాశులవారికి ఆర్థికంగా బాగుంటుంది

Rasi Phalalu Today 4th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 4 మార్చి - 2023, శనివారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు ఎవరు విజయం సాధిస్తారు, మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశి

ఆఫీసులో ఇబ్బందులు రావచ్చు. అన్ని పనులను చాలా జాగ్రత్తగా చేయండి. మీ శత్రువులు మీకు హాని కలిగించాలని ప్లాన్ చేస్తారు. కానీ మీరు మీ తెలివితో వారిని ఓడించగలరు. ఆగిపోయిన డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  వ్యాపారాలు చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు. దాని కారణంగా వారు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు అధికారుల మద్దతు పొందుతారు. ఫలితంగా మీరు మీ పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంతో పాటు, మీరు కొన్ని వ్యాపారం చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. అందులో మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు. ఎవరితోనైనా వైరం ఏర్పడవచ్చు. భాగస్వామ్యంతో చేసిన వ్యాపారం మీకు హానికరం. మీరు అన్ని పనులను ఆలోచించి చేస్తే మంచిది. కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి. 

వృషభ రాశి

మీరు ఏదైనా ఆచీతూచి మాట్లాడాల్సి ఉంటుంది.  మీరు మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని పనులూ చేయవలసి ఉంటుంది. లేకుంటే ఆర్థికంగా బలహీనత ఉండవచ్చు. తల్లి ద్వారా డబ్బు అందుతుంది. మీరు స్నేహితులతో విహారయాత్రకు వెళతారు. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి పనిలో ఇబ్బందులు ఉంటాయి, కానీ మీరు పూర్తి విశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. అవివాహితుల వివాహ నిశ్చయమవుతుంది. 

మిధున రాశి

ఆర్థికంగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు స్నేహితుల ద్వారా ఆదాయ వనరులను పొందుతారు, దాని నుండి మీరు లాభం పొందడం ద్వారా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉండవచ్చు, దాని కోసం మీరు మీ పెద్దలతో మాట్లాడతారు. మనసులో టెన్షన్ అలాగే ఉంటుంది. పనుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కుటుంబంలో అనవసరమైన కోపం, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారికి రేపు గౌరవం పెరుగుతుంది. శ్రామికులకు రేపు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది, అందులో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి అలంకరణ కోసం కొంత షాపింగ్ కూడా చేస్తారు. మీకు ఇష్టమైన పుస్తకాలను చదువుతారు. 

కర్కాటక రాశి 

ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారికి గౌరవం దక్కుతుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు మేలు జరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. అధికారుల సహకారం లభిస్తుంది.  వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకుప్లాన్ చేస్తారు. మీ మనసుకు శాంతి కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన ప్రయోజనం చేకూరుతుంది. మీపై మీకు మరింత నమ్మకం ఉండాలి.

సింహ రాశి

అత్తమామల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో చేతికి అందని బకాయిలను పొందవచ్చు. మనశ్శాంతి కోసం, మీరు ఆధ్యాత్మిక పనుల్లో కొంత సమయాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార రంగంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దీని కారణంగా మీరు కొద్దిగా కలత చెందుతారు. శ్రామికులు విశ్రాంతి లేకుండా పనుల్లో బిజీగా ఉంటారు. దాని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, బాగా అలసి పోతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వైఖరి ఆందోళన కలిగిస్తుంది. 

కన్య రాశి

ఈ రోజు ఆగిపోయిన కొన్ని పనులు పూర్తవుతాయి, దాని కారణంగా మనస్సు సంతోషంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. ఆర్థిక ప్రగతికి అవకాశాలు ఏర్పడతాయి. ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. దాని నుంచి మీరు లాభం పొందడం ద్వారా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తారు. దీని కారణంగా మీరు అప్పులను సకాలంలో చెల్లించగలరు. మిత్రుల సహకారంతో కొత్త పనులు పొందుతారు. మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. భవనం, ఇల్లు, దుకాణం, ప్లాట్లు, ఫ్లాట్ మొదలైనవాటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తారు. విద్యారంగంలో విజయం సాధిస్తారు. 

తులా రాశి

వ్యాపారస్తులకు ఈ రోజు మంచి జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన మీ పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు రావచ్చు. మనసులో ఆనందం ఉంటుంది. పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ అవకాశాలు లభిస్తాయి. విద్యా కార్యాలలో విజయం ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. పనుల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. చాలా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడటం కనిపిస్తుంది. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. మాతృ పక్షం నుంచి ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. మీరు కుటుంబ సభ్యులతో పార్టీకి వెళతారు, అక్కడ ఇతరులతో సయోధ్య పెరుగుతుంది. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకుని ఇంట్లోంచి వెళితే మీ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులు శుభవార్త వింటారు. ఉద్యోగంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అందుతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఫలితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు మీ అత్తమామల వైపు నుంచి కూడా ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలను వినవచ్చు, దాని కారణంగా మీరు గర్వపడతారు. ముఖ్యమైన వ్యక్తిని కలవడం వలన మీ ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. దీని కారణంగా మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. 

ధనుస్సు రాశి
ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అధికారులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వివాదం తలెత్తే పరిస్థితి నెలకొంది. అత్తమామల వైపు కొన్ని శుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్థలం మారే అవకాశం ఉంది. మీరు కార్యాలయంలో ఒకదాని తర్వాత ఒకటి సవాలును ఎదుర్కోవలసి రావచ్చు. ఆగిపోయిన పని ప్రభావవంతమైన మరొకరి సహాయంతో పూర్తవుతుంది.  ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతో ఏ పని చేసినా మీ పనులన్నీ పూర్తవుతాయి.

మకరరాశి

మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని పనుల కోసం ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ విస్తరణ వల్ల కలిగే ఫలితాలు మీకు సంతోషాన్ని అందిస్తాయి. ఇంటి పనులను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు, కానీ మీరు పని చేయడానికి శక్తి లేమిగా భావిస్తారు. సోమరితనం మనస్సులో ఉంటుంది, దాని కారణంగా మీ పని కొంత మిగిలిపోతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తండ్రి వ్యాపారంలో డబ్బు ఖర్చు చేస్తారు. సృజనాత్మక రంగాలలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు, అక్కడ అందరూ సంతోషంగా ఉంటారు. మీరు స్నేహితులతో విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు.

కుంభ రాశి

ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రయోజనం లభిస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మరో ప్రాంతం లేదా విభాగానికి బదిలీ కావచ్చు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు.  ఉద్యోగంలో కష్టపడే పరిస్థితి ఉంటుంది. మీ శత్రువులు మీకు హాని చేయడానికి పదే పదే ప్రయత్నించే అవకాశం ఉంది. మీకు రావల్సిన డబ్బు ఏదైనా ఈ రోజు మీ చేతికి అందవచ్చు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ ఇంటికి కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు అతిథుల ద్వారా ఆదాయ అవకాశాలను పొందుతారు. ఫలితంగా ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తారు. సృజనాత్మక, కళాత్మక రంగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.

మీన రాశి

ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. మంచి వైద్యుడిని సంప్రదించండి, మీ దినచర్యలో కొన్ని మార్పులు తీసుకురండి. శ్రామికుల పనిలో పురోగతి ఉండవచ్చు. పని ప్రాంతంలో కొత్త ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉంటాయి. అధికారుల సహకారం లభిస్తుంది.  మేధోపరమైన పనులు ఆదాయ సాధనాలుగా మారవచ్చు. కుటుంబ సహకారం అందుతుంది. ఆర్థిక రంగంలో పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది, దాని కారణంగా మీరు చాలా సంతోషంగా కనిపిస్తారు. పిల్లల ద్వారా మీ కలలు నెరవేరడం మీరు చూస్తారు. విద్యార్థులు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో సమస్యలుంటే తల్లిదండ్రులతో మాట్లాడి మంచి కోచింగ్ సెంటర్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగాలు చేస్తున్న యువకులు.. ఉద్యోగంతో పాటు వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు.

Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు, ఎందుకంటే..

Published at : 04 Mar 2023 12:47 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today Horoscope for 4th March 4th March Horoscope 4th March Astrology March 4th Horoscope

సంబంధిత కథనాలు

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!

Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!

Sri Rama Navami 2023: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక

Sri Rama Navami 2023: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు