మే 16 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి ప్రలోభాలకు గురికావొద్దు
Rasi Phalalu Today 16th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 16 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారిని ఈ రోజు దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందిని కలిగిస్తుంది. తెలియని భయం వెంటాడుతుంది. మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి.
అవివాహితులు వివాహ ప్రతిపాదనలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. చెడు సహవాసాన్ని నివారించండి. పిల్లల పట్ల ఆందోళన ఉంటుంది. వృత్తి సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది.
వృషభ రాశి
ప్రత్యర్థుల నుంచి భయం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. రిస్క్ తీసుకోకండి. ఎవరికీ సలహా ఇవ్వకండి. భూమి, భవనాల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించనున్నారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సహకారం అందుతుంది. శుభవార్తలు అందుకోవచ్చు.
మిధున రాశి
ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రయాణం సరదాగా సాగుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తుంది. తెలివితేటలతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో కిందిస్థాయి అధికారుల సహకారం లభిస్తుంది. దుర్మార్గుల నుంచి జాగ్రత్త అవసరం. కుటుంబ ఆందోళనలు అలాగే ఉంటాయి. వివాదాలను ప్రోత్సహించవద్దు. పనులు వాయిదా వేయడం మానుకోండి.
Also Read: 786 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి - ముస్లింలు ఆ సంఖ్యను అంతగా ఎందుకు ఆరాధిస్తారు!
కర్కాటక రాశి
లావాదేవీల్లో నిర్లక్ష్యం వద్దు. దీర్ఘకాలిక వ్యాధినుంచి బయటపడవచ్చు. సంతాప వార్తలు వినే అవకాశం ఉంది. ఒకరి ప్రలోభాలకు గురికావొద్దు.జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం చక్కగా సాగుతుంది. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. తొందరగా అలసిపోతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఆదాయం పెరుగుతుంది.
సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు ధైర్యం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఆఫీసులో ఆనందం, శాంతి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది.
కన్యా రాశి
ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చెడు వ్యక్తుల నుంచి హాని ఉండొచ్చు. శుభవార్తలు అందుకుంటారు. ఇంటికి అతిథుల రాక ఉంటుంది. కొన్ని పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది.
తులా రాశి
ఆశించిన విజయం సాధిస్తారు. వ్యాపార రంగం అభివృద్ధి చెంది ఊహించని లాభం పొందుతారు. బెట్టింగ్, లాటరీలకు దూరంగా ఉండండి. మీకు పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. సంతోషంగా గడుపుతారు.. శత్రువులు మీ ముందు తలవంచుతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అన్ని వైపుల నుంచి విజయం మీ సొంతం.
వృశ్చిక రాశి
రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మక ప్రకటన ఇవ్వండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వివాదాలకు దూరంగా ఉండండి.. కొన్ని లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ, అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సామాజిక సేవ చేయాలనుకున్న సాధ్యం కాదు . ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు. ఆందోళన గా ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది.
Also Read: మే మూడో వారంలో ఈ రాశులవారికి ఆస్తి ప్రయోజనాలున్నాయి, మే 15 నుంచి 21 వరకూ వారఫలాలు
ధనుస్సు రాశి
వ్యాపారం లో అసాధారణ విజయాలు సాధిస్తారు. కంటి సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. భాగస్వాముల నుంచి మద్దతు లభిస్తుంది. ఉన్నత అధికారంలో ఉన్న ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. తొందరపాటుగా వ్యవహించవద్దు. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి. వివాదాలు రావచ్చు.
మకర రాశి
పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు . పెద్ద పెద్ద పనులు నెరవేరుతాయి. కొత్త ప్రణాళిక రూపొందంచు కుని దాని ప్రకారం నడుచుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొత్త వెంచర్‌ను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. సామాజిక సేవ చేసే అవకాశం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉండవచ్చు. సోమరితనం తగ్గించుకుంటే మీకు మంచి జరుగుతుంది.
కుంభ రాశి
క్యాటరింగ్ వ్యాపారులకు ప్రతికూల సమయం జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధిత వ్యాధులు రావచ్చు. ధనం లాభం,సంతోష సాధనాలు సమకూరుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉన్నత అధికారులు ఉద్యోగంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సహకారం అందుతుంది. కొంత బలహీనంగా అనిపించవచ్చు. మీ పనులు సులభంగా జరుగుతాయి.. పూజల పట్ల మనసు నిమగ్నమై ఉంటుంది. సంతోషంగా ఉంటారు.. ఏ పనిని వాయిదా వేయకుండా పూర్తి చేయండి.
మీన రాశి
అపజయాలు ఎదురవుతాయి . భాగస్వాములతో విభేదాలు, వాదనలు పెరుగుతాయి. విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల నుండి ఏమీ ఆశించవద్దు. ఫలితం ఆశించకుండా పని పై శ్రద్ద పెట్టండి. ఆదాయం నిశ్చలంగా ఉంటుంది. మరిన్ని ప్రయత్నాలు చేస్తే విజయం మీ సొంతం. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.