Horoscope Today 15th September 2022: ఈ రాశివారికి మంచి ఆఫర్ వస్తుంది, సెప్టెంబరు 15 రాశిఫలాలు
Horoscope 15th September 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 15th September 2022: ఈ రాశివారికి మంచి ఆఫర్ వస్తుంది, సెప్టెంబరు 15 రాశిఫలాలు Horoscope Today 15th September 2022 Horoscope 15th September Rasi Phalalu astrological prediction for Aries, Gemini, Vigro, Libra and Other Zodiac Signs Horoscope Today 15th September 2022: ఈ రాశివారికి మంచి ఆఫర్ వస్తుంది, సెప్టెంబరు 15 రాశిఫలాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/489b16d8cf063c3d330bcc3ce840d08a1663168004191217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope 15th September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీరు కొన్ని శుభ కార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కళ, సాహిత్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభదినం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మీరు మెండితనంగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. చర్మ సమస్యలతో ఇబ్బంది పడతారు. మీరు పెద్ద కంపెనీ నుండి జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది.
Also Read: న్యూమరాలజీకి 1 నుంచి 9 వరకూ మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు
కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన రోజు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను కనబర్చే అవకాశం లభిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు లాభపడతారు.
సింహ రాశి
ఈ రోజు మీరు ఎవరిచేతిలోనైనా మోసపోతారు..జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. బ్యాంకింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసర మాటలు తగ్గించండి
కన్యా రాశి
ఈరోజంతా సరదాగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యాల పట్ల మొగ్గు పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలున్నాయి. మీరు స్టాక్ మార్కెట్ నుంచి లాభం పొందుతారు.
తులా రాశి
వ్యాపార ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కెరీర్‌లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఈ రోజు అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ కుటుంబం ,కార్యాలయంలో సామరస్యాన్ని కాపాడుకోండి.
Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం - ఈ 3 రాశులవారూ జాగ్రత్త, ఆ 4 రాశులవారికి అంతా శుభమే
వృశ్చిక రాశి
ఈ రోజు మీ పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ రోజు శుభప్రదం. ఉపాధి పెరుగుతుంది. మీరు అపరిచిత వ్యక్తి నుంచి సహాయం పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ పనిని కార్యాలయంలోని సీనియర్ అధికారులు మెచ్చుకుంటారు. ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
మకర రాశి
మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. సోదర సోదరీమణులు లాభపడతారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు బయట తినకుండా ఉంటే మంచిది.
కుంభ రాశి
వ్యాపారులు ఈరోజు ప్రణాళికలను పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో ఒకరి అనారోగ్య కారణాల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి. కుటుంబం పట్ల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఖర్చులు పెరగుతాయి.
మీన రాశి
వాహన సుఖం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. ఈ రోజంతా సరదాగా ఉంటారు. పనుల్లో వేగం పుంజుకుంటుంది. మీరు ఎవరినైనా ప్రత్యేకంగా కలుసుకుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)