Egypt Yearly Horoscope 2026: ఈజిప్ట్ వార్షిక జాతకం 2026! మేషం నుంచి మీనం 12 రాశుల్లో 2026 ఎవరికి సంతోషం, ఎవరికి సవాలు?
Egypt Yearly Horoscope 2026: ఈజిప్షియన్ జ్యోతిష్యం కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, మేల్కొలుపు కూడా. 2026 సంవత్సరానికి ఈజిప్ట్ జాతకం మేషం నుంచి మీన రాశుల వారికి ఏం చెబుతుంది?

Egypt Yearly Horoscope 2026: ఈజిప్ట్ ప్రాచీన జ్ఞానం ప్రకారం 2026లో మనం ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడతాం. ఈ సంవత్సరం రా, బాస్టెట్, థోత్ ఐసిస్ (ఈజిప్ట్ ప్రాచీన పౌరాణిక దేవతలు) వంటి దేవతల శక్తిని ప్రజలు అనుభూతి చెందుతారట
ఈజిప్ట్ వార్షిక జాతకం 2026
మేషం (Aries)
కొత్త సంవత్సరం 2026 జనవరి నెలలో మకర రాశిలో అంగారక గ్రహం సహకారంతో పని పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. వసంతకాలానికి ముందు వచ్చే గ్రహణాలు మీ ఆకాంక్షలను నెరవేర్చడంలో సహాయపడతాయి. మార్చిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, కెరీర్‌లో పదోన్నతితో పాటు గౌరవాన్ని తెస్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. సంవత్సరం చివరి నాటికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
వృషభం (Taurus)
ఈజిప్ట్ జాతకం ప్రకారం, 2026 సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యం భావోద్వేగ అభివృద్ధికి సంబంధించినదిగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో అంగారక , శని గ్రహాల మిశ్రమ శక్తి అనేక రంగాలలో సహాయక పాత్ర పోషిస్తుంది. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నెలలు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి ఈ రెండు నెలల్లో విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఒత్తిడిని నివారించండి. జూన్‌లో కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశంతో కుటుంబ సంబంధాలు బలపడటంతో పాటు ఉద్యోగానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. సంవత్సరం చివరిలో మీలో ఊహించని మార్పును అనుభూతి చెందుతారు. పరిస్థితులు మునుపటిలా ఉండవు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి నూతన సంవత్సరం 2026 స్థిరత్వం , కోరికలను నెరవేర్చడంతో నిండి ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో మీరు వేసిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. అంగారకుడు మకర కుంభ రాశులలో ఉంటాడు, ఇది మీకు వివేకాన్ని , తెలివితేటలను అందిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. మీరు వదిలించుకోవాలనుకునే ఏవైనా ప్రతికూల అలవాట్లలో విజయం సాధిస్తారు. జూన్ మధ్యలో ఇంట్లో శాంతి నెలకొంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఎలాంటి నిర్ణయాలనైనా తొందరపాటుతో తీసుకోవడం మానుకోండి. సంవత్సరం చివరిలో ఆర్థిక , ఆరోగ్య రంగాలలో మెరుగుదల కనిపిస్తుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరం ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకురావచ్చు. జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి .. మీరు భావోద్వేగంగా బలపడతారు. సంబంధాలలో ఉద్రిక్తతలు ఉన్న వ్యక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. సంవత్సరం మొదటి గ్రహణం తర్వాత ఉద్యోగ రంగంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మార్చి నుంచి నవంబర్ వరకు కేతు సంచారం పాత కర్మ బంధాలను తెంచుతుంది సహనాన్ని పరీక్షిస్తుంది. సంవత్సరం చివరిలో భావోద్వేగంగా స్థిరత్వం వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేయండి.
సింహం (Leo)
సింహ రాశి వారికి నూతన సంవత్సరం 2026 భావోద్వేగంగా ఎత్తుపల్లాలతో కూడుకొని ఉంటుంది. అంగారక , శని గ్రహాల స్థితి కారణంగా మీరు మీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది కెరీర్‌కు సంబంధించినది కూడా కావచ్చు. గ్రహణ కాలంలో సంబంధాలలో స్థిరత్వం వస్తుంది . ఆర్థిక విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. జూన్‌లో బృహస్పతి కర్కాటక రాశిలో ఉండటం వల్ల జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సరం చివరిలో మీ వ్యక్తిత్వం మరింత ప్రభావవంతంగా మారుతుంది.
కన్య (Virgo)
2026 సంవత్సరం కన్య రాశి వారికి అద్భుతమైన సంవత్సరం కానుంది. అంగారక , శని గ్రహాల ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది . మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. సంవత్సరం మొదటి గ్రహణ కాలంలో ముఖ్యమైన చర్చలలో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది
బృహస్పతి దిశ మార్పుతో మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఆగస్టులో అంగారకుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో సామాజిక జీవితంలో గౌరవం పెరుగుతుంది. సంవత్సరం చివరిలో పరిస్థితులు క్రమబద్ధీకరించబడతాయి .. పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి.
తుల (Libra)
2026 సంవత్సరం తులా రాశి వారికి జీవితంలో ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి ఉత్తమమైనది. అంగారక గ్రహం ప్రభావంతో మీరు కొత్త పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. మే నెలలో ఆరోగ్యం, కెరీర్ విద్య రంగాలలో ఊహించని ఫలితాలు సాధిస్తారు. జూన్‌లో కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశంతో కుటుంబ జీవితం బలపడుతుంది ... గృహ కలహాల నుంచి విముక్తి లభిస్తుంది. సంవత్సరం చివరిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఆత్మవిశ్వాసంలో అద్భుతమైన ఉత్సాహాన్ని అనుభూతి చెందుతారు
వృశ్చికం (Scorpio)
2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రేమలో బలాన్ని అందించడంతో పాటు సహనాన్ని కూడా నేర్పుతుంది. ఈ సమయంలో సుదీర్ఘ ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు పోరాడవలసి రావచ్చు. గ్రహణాలు మీకు సహనం పాటించాల్సిన రంగాలను వెలుగులోకి తెస్తాయి. జూన్ మధ్యలో వృషభ రాశిలో అంగారకుడు మీ జీవితంలోని అన్ని పనులలో మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. నవంబర్ నెలలో సింహ రాశిలో అంగారకుడు మీకు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాడు. మీ సహచరులపై కోపం తెచ్చుకోవడం మానుకోండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరం భావోద్వేగంగా బలపడుతుంది. ప్రారంభంలో అంగారక .. శని గ్రహాల ప్రభావంతో మీరు చిక్కుకుపోయే భావోద్వేగాలను ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహణ కాలంలో సంబంధాలలో భావోద్వేగంగా బలహీనంగా అనిపిస్తుంది. జూన్‌లో బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో మీరు సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్ళవచ్చు. శని వక్ర సంచారం సమయంలో కుటుంబ సమస్యలు బయటపడతాయి. సంవత్సరం చివరి నాటికి మీరు మీ భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో నిష్ణాతులవుతారు.
మకరం (Capricorn)
2026 సంవత్సరంలో భవిష్యత్తు స్పష్టంగా కనిపించవచ్చు. 10 విషయాల వెంట పరుగెత్తడానికి బదులుగా సరైన లక్ష్యాన్ని గుర్తిస్తారు. గ్రహణ కాలం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంబంధాలలో ఉన్న అపార్థాలు తొలగిపోయి, మాధుర్యం వస్తుంది. డబ్బు లావాదేవీలలో జాగ్రత్త వహించండి.ఉద్యోగంలో కాలక్రమేణా పదోన్నతి లభించే అవకాశం ఉంది. సంవత్సరం చివరిలో మనశ్శాంతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి నూతన సంవత్సరం 2026లో మీ పరిమితులను నిర్దేశిస్తుంది. వ్యక్తులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు. పని భారం కారణంగా మనస్సు అస్తవ్యస్తంగా ఉంటుంది. అయితే, మంచి విషయం ఏమిటంటే, మొదటి అర్ధభాగం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. సంవత్సరం చివరిలో ఆత్మగౌరవం , భావోద్వేగంగా మిమ్మల్ని మీరు బలంగా భావిస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి నూతన సంవత్సరం 2026 ఎత్తుపల్లాలతో కూడుకుని ఉంటుంది. అంగారక , శని గ్రహాల ప్రభావంతో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మంచి అలవాట్లను జీవనశైలిలో చేర్చుకోవడంతో పాటు సంపాదన నైపుణ్యాలపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. వివాహితులు ప్రేమలో కొత్త శక్తిని అనుభూతి చెందవచ్చు. కెరీర్ విషయంలో జాగ్రత్త వహించండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.



















