అన్వేషించండి

సెప్టెంబరు 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారు శని ఆరాధన చేయండి!

Horoscope Prediction 28 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 28 September 2024

మేష రాశి

ఈ రోజు ఏదో విషయంలో మీరు పశ్చాత్తాపపడతారు. స్నేహితుల మీ మనోధైర్యాన్ని పెంచుతారు.  మీ పురోగతి గురించి భయపడతారు. ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు ఈరాశివారు శని ఆరాధన చేయండి. వ్యాపారంలో మంచి మొత్తాన్ని పెట్టుబడి పెడితే లాభపడతారు. అనవసరమైన పనుల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. ప్రేమికులు వాదనలకు దూరంగా ఉండాలి. కోప స్వభావం ఉన్నవారు విమర్శలను ఎదుర్కొంటారు.  

మిధున రాశి 

కుటుంబానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటారు. చెడు వ్యక్తులను కలవాల్సిరావొచ్చు. మీ లక్ష్యాలపై పూర్తి అవగాహన కలిగి ఉండండి. బ్యాంకింగ్ రంగంలో ఉండేవారికి పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. 

కర్కాటక రాశి 

ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. అనవసర గందరగోళానికి గురికావొద్దు. ప్రియమైనవారినుంచి బహుమతులు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. 

Also Read: పితృ పక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి.. కుటుంబంలో సంతోషం కోసం ఈ నియమాలు పాటించండి!

సింహ రాశి

శివుడి  ఆరాధించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.  మీ ప్రియమైన వారి పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉండేవా చూసుకోండి.  పనికిరాని పనుల్లో మీ సమయాన్ని వృథా చేయకండి.  

కన్యా రాశి 

రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి ఈ రోజు కలిసొస్తుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. తక్కువ శ్రమతో మంచి ఫలితాలు పొందుతారు. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండడం మంచిది. 

తులా రాశి

ఉద్యోగం మారడం గురించి   ఆలోచించవచ్చు. పాత ఆలోచనలు వదిలేసి కొత్త ఆలోచనలు అలవర్చుకోండి. గ్రహాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి...నూతన ప్రణాళికలు అమలుచేసుకోవచ్చు. చేపట్టిన పనిలో అడ్డంకులున్నా..మీ సంకల్ప బలంతో పూర్తిచేస్తారు. 

వృశ్చిక రాశి

పెద్దల ఆలోచనలతో మీరు ప్రభావితమవుతారు. ప్రణాళికాబద్దంగా చేసే పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితం సాధించగలరు. పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది.  

ధనస్సు రాశి

రోజు ఆరంభం కన్నా గడిచేకొద్దీ చికాకు పెరుగుతుంది. మీ ఆలోచనలతో మీ చుట్టూ ఉండేవారు ప్రయోజనం పొందుతారు. ఇష్ట దైవారాధన ప్రశాంతతని ఇస్తుంది. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం . ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!

మకర రాశి

వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి మద్దతు పొందవచ్చు. మీరు చేపట్టే పనులపై పూర్తిస్థాయి నమ్మకంగా ఉంటారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఉండేవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

కుంభ రాశి

వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు. సహోద్యోగులతో కొన్ని సమస్యలుంటాయి..వాటిని కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఏకాగ్రతతో  శ్రమిస్తే మంచి ఫలితాలు వస్తాయి.  

మీన రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. పరస్పర సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.నిరుద్యోగులు శుభవార్త వింటారు. మనసుపై భారం తగ్గుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: వేంకటేశ్వరుడికి శనివారం ప్రత్యేకం కదా.. మరి తిరుమలలో అభిషేకం శుక్రవారం ఎందుకు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Delhi Crime: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
Embed widget