అన్వేషించండి

మహాభారత యుద్ధానికి ముందు 15 రోజుల వ్యవధిలో ఏం జరిగిందో.. ఆగస్టు 2026లో అదే జరగబోతోంది!

Grahan 2026 Date: ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ , ఆగస్టు 28వ తేదీన రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి. హిందూ మతంలో గ్రహణాలను అశుభంగా భావిస్తారు. మరి ఒకే నెలలో 2 గ్రహణాలు అశుభానికి సంకేతమా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 ఆగస్టులో 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి.
  • ఆగస్టు 12 సూర్య, 28 చంద్ర గ్రహణాలు భారతదేశంలో కనిపించవు.
  • 15 రోజుల్లో రెండు గ్రహణాలు ప్రపంచ మార్పులకు, సంక్షోభాలకు సంకేతం.

August 2026 two Eclipses in 15 days:  2026 ఆగస్టు నెలలో 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి. వాటిలో ఒకటి సూర్యగ్రహణం, మరొకటి చంద్ర గ్రహణం.హిందూమతంలో శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శివారాధనకు, లక్ష్మీఆరాధనకు శుభకరం ఈ నెల.  ఈ నెలలో ఉపవాసం , పూజలతో ఆధ్యాత్మిక శక్తి  నిరంతర ప్రవాహాన్ని కొనసాగిస్తాయి. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగష్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు. అయితే ఆషాఢ మాసం అమావాస్య రోజు..అంటే శ్రావణ మాసం ప్రారంభానికి ఓ రోజు ముందు గ్రహణం ఏర్పడుతోంది. 

జ్యోతిష్యం , హిందూ మతంలో గ్రహణాలను అశుభమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, ప్రజలు తరచుగా వాటి గురించి ఆందోళన చెందుతుంటారు. అదే సమయంలో, కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు సంభవించడం మతపరంగా , జ్యోతిష్యపరంగా కూడా ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అందువల్ల, శ్రావణ మాసంలో రెండు గ్రహణాలు సంభవించడం నిజంగా ప్రమాదానికి సంకేతమా కాదా?
 
ఆగస్టు నెలలో సూర్యగ్రహణం , చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తాయి?
 
సూర్యగ్రహణం (Surya Grahan 2026) 

2026 సంవత్సరంలో రెండవ చివరి సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజు సంభవిస్తుంది. ఇది భారత కాలమానం ప్రకారం రాత్రి 8:04 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:07 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతకం  వర్తించదు.

చంద్రగ్రహణం  (Chandra Grahan 2026 )

సూర్యగ్రహణం జరిగిన 15 రోజుల తర్వాత, ఆగస్టు 28వ తేదీన శ్రావణ మాస పౌర్ణమి నాడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం, ఈ చంద్రగ్రహణం ఉదయం 8:04 గంటలకు ప్రారంభమై ఉదయం 11:22 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు..అందుకే భారతదేశంలో సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు
 
శ్రావణ మాసంలో రెండు గ్రహణాల కలయిక
 
ప్రఖ్యాత జ్యోతిష్కుడైన డాక్టర్ అనీష్ వ్యాస్..ఈ సంవత్సరం చివరి సూర్య, చంద్ర గ్రహణాలు .. ఖగోళ శాస్త్ర దృక్కోణం నుంచి ఇది ఒక సాధారణ సంఘటన అయినప్పటికీ, జ్యోతిష్యం , పౌరాణిక నమ్మకాలలో, గ్రహణాలను రాశిచక్రం, ప్రపంచం, వాతావరణం, రాజకీయాలకు సంబంధించి పెద్ద మార్పులు, కల్లోలం లేదా సంక్షోభానికి సంకేతంగా పరిగణిస్తారు. 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు సంభవించడం అశుభ కలయికగా పరిగణిస్తారు. రాహువు, కేతువులు తక్కువ వ్యవధిలో (15 రోజులు) సూర్యచంద్రులు ఇద్దరినీ పీడించినప్పుడు, ప్రతికూల శక్తి పెరగవచ్చని నమ్ముతారు. పౌరాణిక గ్రంథాలు నమ్మకాల ప్రకారం, 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు సంభవిస్తే, అది ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధానికి దారితీయవచ్చు.

మహాభారత యుద్ధానికి ముందే 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు సంభవించాయని అంటారు. గ్రహణ కాలంలో మతపరమైన కార్యకలాపాలు  నిషేధించినప్పటికీ ఈ కాలాన్ని మంత్ర జపానికి, ఆత్మపరిశీలనకు ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఆగస్టులో సంభవించే రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించవు, కాబట్టి వాటి వల్ల పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండదు. అయినప్పటికీ, ఇది దేశానికి, ప్రపంచానికి ఒక ముఖ్యమైన పరివర్తన కాలం కావచ్చు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

Frequently Asked Questions

2026 ఆగస్టు నెలలో గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తాయి?

2026 ఆగస్టు 12న సూర్యగ్రహణం, ఆగస్టు 28న చంద్రగ్రహణం సంభవిస్తాయి. ఇవి 15 రోజుల వ్యవధిలో వస్తాయి.

ఆగస్టు 2026 గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా, సూతకం వర్తిస్తుందా?

ఆగస్టులో సంభవించే సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం రెండూ భారతదేశంలో కనిపించవు. అందువల్ల, ఇక్కడ సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు.

15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు సంభవించడం ఎందుకు ముఖ్యమైనదిగా పరిగణిస్తారు?

జ్యోతిష్యపరంగా, ఇది ప్రమాదకరమైనదిగా భావిస్తారు. రాశిచక్రం, ప్రపంచం, వాతావరణం మరియు రాజకీయాలకు సంబంధించి పెద్ద మార్పులు లేదా సంక్షోభానికి సంకేతంగా దీన్ని చూస్తారు.

రెండు గ్రహణాల కలయిక వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు?

పౌరాణిక నమ్మకాల ప్రకారం, ఇది ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధానికి దారితీయవచ్చు. మహాభారత యుద్ధానికి ముందు కూడా ఇలాగే జరిగిందని చెబుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
16-10-2026 శుక్రవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది?
16-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశుల వారికి అదృష్టం, ధనలాభం!
16-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశుల వారికి అదృష్టం, ధనలాభం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget