అన్వేషించండి

YSR Aasara Scheme: డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ శుభవార్త, అకౌంట్లలో డబ్బులు జమ ఎప్పుడంటే!

YS Jagan To visit Uravakonda: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల నగదు జమ చేయనున్నారు.

Good News to Dwcra Women: అనంతపురం: ఏపీలో డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) శుభవార్త అందించారు. వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల నగదు జమ చేయనున్నారు.

ప్రభుత్వం ఇదివరకే వైఎస్సార్‌ ఆసరా కింద మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు డ్వాక్రా మహిళలకు అందించింది. నాలుగో విడత కిందట రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల జాబితాపై ఏమైనా సందేహాలు ఉన్నవారు హెల్ప్‌లైన్ నంబర్ 0863-2347302 కు కాల్ చేయవచ్చు. లేకపోతే ఇమెయిల్ ఐడీ  supportmepma@apmepma.gov.in ద్వారా సంప్రదించాలని సూచించారు.

సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా...
- ఏపీ సీఎం వైఎస్ జగన్ జనవరి 23వ తేదీన ఉదయం 9 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 9.45 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు
- పుట్టపర్తి ఎయిర్ పోర్టు నుంచి జగన్ హెలికాప్టర్‌లో బయల్దేరి 10.30 గంటలకు ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు
- అనంతరం 10.30 నుంచి 10.40 గంటల వరకు ప్రజాప్రతిధులతో సీఎం జగన్ మాట్లాడతారు. అక్కడి నుంచి బహిరంగ సభావేదిక వద్దకు వెళ్తారు
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా సంఘాల) మహిళలతో సీఎం జగన్ మాట్లాడి వారి వివరాలు తెలుసుకుంటారు. 
- అనంతరం కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. తరువాత వైఎస్సార్‌ ఆసరా (YSR Asara) నాలుగో విడత కింద డ్వాక్రా సంఘాల ఖాతాల్లో ఆయన నగదు జమ చేస్తారు
- కార్యక్రమం పూర్తయ్యాక జగన్ స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌ సీపీ నేతలతో చర్చిస్తారు
- మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.30కు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరతారు. అటు నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం..
సీఎం వైఎస్‌ జగన్‌ ఉరవకొండ పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు. ఇదివరకే సత్యసాయి ఎయిర్ పోర్ట్ పరిసరాలనుఆయన పరిశీలించారు. సీఎం జగన్‌ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని... ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉరవకొండ వెళ్తారన్నారని చెప్పారు. కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుని ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో వెళతారని చెప్పారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పనిచేయాలని సిబ్బంది, అధికారులను ఆదేశించారు. 

Also Read: AP Voter List: ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల, మీ డీటైల్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేస్కోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Embed widget