అన్వేషించండి

AP Elections 2024: ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Andhra Pradesh Elections 2024: క్రోసూరు: రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. తమ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో అన్ని రంగాలను జగన్ నాశనం చేశాడని ఆరోపించారు.
పల్నాడు జిల్లా క్రోసూరులో శనివారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. ఏపీ ప్రయోజనాల కోసం  పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. గంజాయి ఉంటే చాలు అనుకుంటే జగన్‌ అధికారంలో ఉండాలి. టీడీపీ, జేనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పెదకూరపాడులో ఐటీపార్కు ఏర్పాటు చేస్తామని’ హామీ ఇచ్చారు.

వాళ్లను అంతం చేసేందుకు బీజేపీతో కలిశాం! 
‘రాముడు దేవుడు అయినప్పటికీ వానర సైన్యంతో కలిసి రావణాసురుడిపై పోరాడారు. ఏపీలోనూ అలాగే అంతం చేసేందుకు బీజేపీతో కలిశాం. ముస్లింలు, బాలికలు, మహిళల్ని వైసీపీ నేతలు వేధించారు. 2014- 18 సమయంలో ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా? వారికి మేం అండగా నిలిచాం.  అధికారంలోకి వచ్చినా 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తాం. ఏపీలో జాబు రావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. యువత కంటే నా ఆలోచనలు చాలా ముందుంటాయి. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. సంపద సృష్టించి పేదలకు పంచుతాం. కొరియా నుంచి ఏపీకి కియా సంస్థను నేనే తీసుకొచ్చా. వేధింపులతో అమర రాజా కంపెనీ తెలంగాణకు వెళ్లింది. సూపర్ సిక్స్ తో మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తాం. 

వైసీపీ సర్కార్ రూ.10 ఇచ్చి రూ.100 తీసుకుంటుంది 
తల్లికి వందనం ద్వారా మహిళలకు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. పేదలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. పింఛన్ల పంపిణీలో సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ రూ.10 ఇచ్చి రూ.100 తీసుకుంటుంది. సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఎందుకు ఇవ్వలేరు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.4వేల పింఛన్‌ ఇస్తాం. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఓ తల్లి చెప్పారు. పిల్లలకే న్యాయం చేయలేదు. రాష్ట్రానికి వాళ్లు ఏం చేస్తారు. ఆడ పిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి, కానీ మా ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని’ చంద్రబాబు ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget