అన్వేషించండి

YSRCP : లడ్డూ కల్తీ జరగలేదని బీజేపీ జాతీయ నేతల్ని నమ్మించడానికే జగన్ ప్రయాస - ట్విట్టర్ ట్యాగులతో పనైపోతుందా ?

Tirumala Laddo : లడ్డూ కల్తీ జరగలేదని బీజేపీ నేతలు నమ్మాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి,లెటర్లు రాసి వాటిని సోషల్ మీడియాలో అందరికీ ట్యాగ్ చేస్తున్నారు.

Why is Jagan trying to make BJP leaders believe that the laddu was not adulterated : తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ చేశారని .. జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చేసిన ఆరోపణలు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెను సమస్యగా మారాయి. హిందువులు, హిందూ సంఘాల నుంచి వచ్చే నిరసనతో పాటు బీజేపీ పెద్దలు ఈ ఆరోపణల్ని నమ్మకూడదని తన వాదనను ప్రత్యేకంగా వారి దృష్టి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేసి.. ఆలయ ప్రతిష్టను దిగజార్చి రాజకీయం చేస్తున్నారు కానీ.. అసలు తప్పు జరగలేదంటున్నారు. తన వాదనను వారి దృష్టికి తీసుకెళ్లడానికి జగన్ ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. 

లేఖ,ప్రెస్‌మీట్‌ను అందరికీ ట్యాగ్ చేసిన జగన్

లడ్డూ కల్తీ ఆరోపణలు వచ్చిన తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు తప్పు చేశారని ప్రకటించారు. నిజాలేంటో ప్రధాని మోదీకి, చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానని ప్రకటించారు. ఆ తర్వాత మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను  సోషల్ మీడియాలో పోస్టు చేసి కనీసం వంద మందికి ట్యాగ్ చేశారు. ఇందులో బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు, ఆరెస్సెస్ నేతలు , బీజేపీ ముఖ్యమంత్రులు , హిందూ మత ప్రముఖులు ఉన్నారు. వారందరూ తన లేఖను చదవాలని నిజాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. ఈ లేఖలను వారు చదివారో లేదో కానీ వెంటనే డిక్లరేషన్ వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల టూర్ మానుకుని మళ్లీ ప్రెస్మీట్ పెట్టి మొత్తం లేఖలో చెప్పిందే చెప్పారు. ఆ వీడియోను శనివారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి.. న్యాయం మీరే చెప్పాలని.. మళ్లీ ముఖ్య బీజేపీ నేతలకు.. హిందూత్వ వాదులకు.. ప్రముఖ ఆలయాలకూ ట్యాగ్ చేశారు. జగన్ ప్రయత్నాలను టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం తన ప్రయత్నం తాను చేస్తున్నారు. 

Also Read: Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం

లడ్డూ వివాదం కారణంగా ఏపీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందన్న దానిని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ పెద్దలకు, హిందూత్వ సంస్థలు నడిపే వారికి ఎంత కోపం వస్తుంద అని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రత్యేకంగా ప్రతీ ప్రెస్ మీట్, లెటర్‌లోనూ  బీజేపీ ప్రస్తావన తెస్తున్నారు. టీటీడీ  బోర్డులో బీజేపీ వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారని.. ఏదైనా తప్పు జరిగితే వాళ్లకీ బాధ్యత ఉంటుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. అసలేం జరగలేదన్న తమ వాదననతో ఏకీభవించి చంద్రబాబును తిట్టాలని కూడా ఆయన నేరుగా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేశామని వారు నమ్మితే తాను తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ బయపడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అదంతా చంద్రబాబు రాజకీయమే తప్ప.. తన తప్పేమీ లేదని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు వీరికే - రాజీనామాలు చేసిన వారెవరికీ చాన్స్ లేనట్లే ?

ఢిల్లీకి వెళ్లి కలిసి చెప్పే టీమ్ కూడా గల్లంతు అయిందా ?

మామూలుగా అయితే జగన్ ఇలాంటి సందర్బాల్లో ఢిల్లీ పెద్దలకు తన వాదన వినిపించుకోవాలంటే ఆయనకు ఓ టీమ్ ఉంటుంది. ఎంపీలతో కలిసి వెళ్లి నేరుగా ఢిల్లీ పెద్దల్ని కలిసి తమ వాదన వినిపిస్తూ ఉంటారు. ఈ సారి ఢిల్లీలో పరిస్థితుల్ని చక్కబెట్టే టీమ్ అంతా చెల్లాచెదురు అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో పరిస్థితుల్ని చక్క బెట్టి విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారు. సుబ్బారెడ్డి వివాదాల్లో ఉన్నారు. ఇక డిల్లీలో అందరూ నేతల అపాయింట్‌మెంట్లు తీసుకునే సీనియర్ నేతలు కూడా ఎవరూ లేరు. ఈ కారణంగా జగన్  సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా జగన్..తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో ఎవరూ ఊహించనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోందని వైసీపీ వర్గాలు కూడా గుసగుసలాడుకుంటున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి అది కూలగొట్టు: హరీష్ రావు
రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి ముందు అది కూలగొట్టు: హరీష్ రావు
Shraddha Srinath In NBK 109: బాలకృష్ణ సరసన ఎన్‌బికె 109లో శ్రద్ధా శ్రీనాథ్... అఫీషియల్ గురూ!
బాలకృష్ణ సరసన ఎన్‌బికె 109లో శ్రద్ధా శ్రీనాథ్... అఫీషియల్ గురూ!
TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి అది కూలగొట్టు: హరీష్ రావు
రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి ముందు అది కూలగొట్టు: హరీష్ రావు
Shraddha Srinath In NBK 109: బాలకృష్ణ సరసన ఎన్‌బికె 109లో శ్రద్ధా శ్రీనాథ్... అఫీషియల్ గురూ!
బాలకృష్ణ సరసన ఎన్‌బికె 109లో శ్రద్ధా శ్రీనాథ్... అఫీషియల్ గురూ!
TGSRTC: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
First Selfie: భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
భారత్‌లో ఫస్ట్‌ సెల్ఫీకి 145 ఏళ్లు? - ఆ రోజుల్లోనే ఆ సెల్ఫీ ఎవరు దిగారు?, వాళ్ల ప్రత్యేకతలు ఏంటి?
Toyota Glanza 2024 Car Review: టయోటా గ్లాంజా 2024 రివ్యూ - చవకైన ఆటోమేటిక్ కార్లలో బెస్ట్!
టయోటా గ్లాంజా 2024 రివ్యూ - చవకైన ఆటోమేటిక్ కార్లలో బెస్ట్!
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర! - ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Embed widget