అన్వేషించండి

Weather Updates: త్వరలో మరో అల్పపీడనం - ఏపీలో అక్కడ మోస్తరు వర్షాలు, తెలంగాణలో ప్రభావం ఇలా

ఏపీతో యానాం, తమిళనాడులోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. నవంబర్ 8 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

Rains in Telangana AP: ఏపీలో వర్షాలు తగ్గుముఖం పడుతుండగా, తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. అయితే నేడు సైతం ఏపీలో కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయిని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు మార్చుకుంటున్నాయి. బంగాళాఖాతంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీతో యానాం, తమిళనాడులోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తమిళనాడులో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

నవంబర్ 8 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఏర్పడనునున్న ఈ అల్పపీడనం ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాలపై ప్రభావం చూపనుంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తుండగా, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. ఏడేళ్ల కిందటి వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 2015 లో నెల్లూరులో 200 - 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది సైతం అంతే వర్షాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు, తిరుపతి జిల్లా ప్రజలను హెచ్చరించారు. 

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా పొడిగా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్నటివరకు కొన్నిచోట్ల తేలికపాలి జల్లులు కురిశాయి. నవంబర్ రెండో వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో అక్కడక్కడా వర్షాలు పడతాయి. నవంబర్ 8, 9 తేదీలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు, మూడు వర్షాలు కురవనున్నాయి. అయితే వర్షాలు పడకపోతే పంట ఏ ఇబ్బంది లేకుండా చేతికి వస్తుందని రైతులు భావిస్తున్నారు.

హైదరాబాద్ ను పాక్షికంగా మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. నగరంలో కొన్ని ఏరియాలలో తేలికపాటి వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య, తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 68కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మనకు పల్నాడు నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉంది. ప్రస్తుతం పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా విస్తరిస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ నగరంలో వర్షాలున్నాయి. భారీ గాలుల కోస్తాంధ్ర వైపుగా కలవడం వలన ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో నేడు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనంతో పాటు వస్తున్న ఉపరితల ఆవర్తనం కాస్త ఆలస్యంగా రావడం వలన రాత్రివేళ అధికంగా కురవనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చలి గాలులు వీచనున్నాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
చెన్నైకి దగ్గరగా ఉన్న​తమిళనాడు సరిహద్దు భాగాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇంతవరకు కోస్తా ప్రాంతాల్లో విస్తరిస్తున్న వర్షాలు ఇక నెమ్మదిగా కడప జిల్లాలో తగ్గుముఖం పట్టి, అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. అత్యధికంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలున్నాయి.  
. బాపట్ల జిల్లాలో కురిసే వర్షాలు విజయవాడ నగరం దక్షిణ భాగాలైన గుంటూరు జిల్లాలోని పలు భాగాల్లోకి వెళ్లనుంది. ఏడేళ్ల తరువాత ఆ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కానుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం కదలిక వల్ల గాలులు దిశ మార్చుకుంటున్నాయి. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా దక్షిణ భాగాల్లోనూ వర్ష సూచన ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget