By: ABP Desam | Updated at : 29 Sep 2021 07:19 AM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాలను గులాబ్ తుపాను గజగజా వణికించింది మరవకముందే.. మరో హెచ్చరిక అందుతోంది. ఇప్పటికే గులాబ్ తుపాను ఉత్తరాంధ్ర సహా మొత్తం ఆరు జిల్లాలను గజగజా వణికించింది. ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం ఉత్తరకొంకన్ ప్రాంతం నుంచి నైరుతి విదర్భ, ఉత్తరకోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం .కొనసాగుతోంది. దీనితో రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Synoptic features of Weather inference and weather warnings in Telugu for Andhra Pradesh dated 28.09.2021 pic.twitter.com/VrsHi6GlZ0
— MC Amaravati (@AmaravatiMc) September 28, 2021
దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలోని పలుప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం తుపాను ప్రభావం తగ్గిపోతున్నప్పటికీ.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ‘గులాబ్’ తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి సీజన్‌లో అత్యధికంగా 95.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 28, 2021
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>