By: ABP Desam | Updated at : 09 Dec 2021 07:56 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, తూర్పు గాలుల ప్రభావంతో కోస్తాలో మేఘాలు ఆవరించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరి కోతలు కోసే రైతులు అప్రమత్తం కావాలని వ్యవసాయ శాఖ సూచించింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది. వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంచనా వేసింది. నిన్న నల్గొండలో 33.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, జీహెచ్ఎంసీ పరిధిలో 31.2 డిగ్రీల ఉష్ణోగ్రత బేగంపేట్‌లో నమోదయిందని ఐఎండీ పేర్కొంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 8, 2021
Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం 5వ రోజు పాదయాత్ర షెడ్యూల్
Jagan Flight : సాయంత్రం సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ! రాత్రి ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం