Weather Latest Update: వాయుగుండంగా మారిన అల్పపీడనం - ఈ జిల్లాల్లో తీవ్రమైన చలికి అవకాశం
ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది.

నైరుతి బంగాళాఖాతం (తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం, హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం) లో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు బుధవారం చెప్పారు. దీని ప్రభావం ఏపీపై అంతంతమాత్రంగానే ఉంటుందని వివరించారు.
ఏపీలో మీదుగా వీస్తున్న ఈశాన్య, ఆగ్నేయ గాలులు వల్ల రాష్ట్రంలో పొగమంచు పెరుగుతుందని చెప్పారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా మరింత పడిపోతాయని చెప్పారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
‘‘బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరో రెండు మూడు రోజుల వరకు ఉత్తర - ఈశాన్య దిశగా, అలాగే ఉత్తర - వాయువ్య దిశగా కదలనుంది. దీని వలన ప్రభావంతో మరో మూడు రోజులు వరకు విపరీతమైన చలి కాలాన్ని చూసే అవకాశాన్ని ఈ వాయుగుండం ఇవ్వనుంది. అటు విశాఖ నగరం తీసుకున్నా, అటు విజయవాడ, గోదావరి జిల్లాలు తీసుకున్నా, అటు రాయలసీమ తీసుకున్నా, చాలా చోట్లల్లో చలి తీవ్రత 14-17 డిగ్రీల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.
అరకు వ్యాలీలో సున్నాకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. అలాగే మారేడుమిల్లి ప్రాంతం, విజయనగరం జిల్లాలోని కొండ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం కాస్త వెచ్చగా ఉండనుంది. ఎందుకంటే మనకు సముద్రం నుంచి తేమ గాలులు వస్తుంటాయి కాబట్టి. డిసెంబరు 25న ముందు చెప్పిన విధంగానే దక్షిణ కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు ప్రారంభించనుంది. దీని వలన మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలము.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 21, 2022
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















