Weather Latest Update: నేడు అధిక ఎండలతోపాటు వానలు కూడా, ఈ ప్రాంతాల్లో పలకరించనున్న వరుణుడు
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ (దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో) కురిసే అవకాశం ఉంది.
ద్రోణి ఈరోజు పశ్చిమ బిహార్ నుండి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో శనివారం (మే 20) తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ (దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 39 నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ)తో కూడిన వర్షాలు తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్, చుట్టు ప్రక్కల జిల్లాలలో (హైదరాబాద్, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలలో) కూడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 నుండి 50 కిమీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులలంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఈదురు గాలులతో పాటు (40 నుంచి 50 కి.మీ.) వచ్చే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 70 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ బిహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు చత్తీస్‌గఢ్ మీదుగా ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అనకాపల్లి,అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఎల్లుండి శ్రీకాకుళం, మన్యం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. అల్లూరి, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉండనున్నాయి. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి అల్లూరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశ ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా వర్షాలకు అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు.