By: ABP Desam | Updated at : 19 Dec 2022 07:50 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
బంగాళాఖాతంలోని ఆగ్నేయ భాగంలో ఏర్పడ్డ బలమైన అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి ఆదివారం (డిసెంబరు 18) నాటికి దక్షిణ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని తెలిపారు. వచ్చే 3 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. అలా శ్రీలంక తీరం వైపుగా కదులుతుందని అంచనా వేశారు. దీని ప్రభావం అధికంగా తమిళనాడుపైన ఉంటుందని వెల్లడించారు.
ఈ నెల 20వ తేదీ నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేశారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడతాయని, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉంటూ ఉంది. ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. ప్రకృతి అందాలు కనివిందు చేస్తున్నాయి.
‘‘ఈ వారం అల్పపీడనానికి పరిస్ధితులు సిద్ధంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఈ వారంలో బలమైన అల్పపీడనం ఏర్పడి శ్రీలంక వైపుగా వెళ్లనుంది. వర్షాలు ఎలా ఉంటాయో ఇంకా ఒక అంచనా లేదు. దీని కోసం ఒకటి, రెండు రోజుల్లో ముఖ్యమైన అప్డేట్ ని ఇస్తాను. డిసెంబరు 21- 25 మధ్యలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం ఉండనుంది.
1) ఎమ్.జే.ఓ (తుఫాను కి బలాన్ని ఇచ్చే ఒక పీడన ప్రాంతం ఇప్పుడు బంగాళాఖాతంలో లేదు కాబట్టి) ఇది తుఫానుగా మారదు.
2) వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) రావడం వలన వర్షాలు కాస్త దక్షిణ ఆంధ్ర వరకు వచ్చే అంచనా ఉన్నది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తర కోస్తా, యానాం
వచ్చే మూడు రోజులు (ఆది, సోమ, మంగళవారం) పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్ర
వచ్చే మూడు రోజులు (ఆది, సోమ, మంగళవారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ
వచ్చే మూడు రోజులు (ఆది, సోమ, మంగళవారం) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది, నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 18, 2022
Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !
Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం
Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ
APBJP : ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీబీజేపీ - నియోజకవర్గాల కన్వీనర్ల ప్రకటన ! వారే అభ్యర్థులా ?
AP CM Delhi Visit: రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్ - మరోసారి ప్రధానితో భేటీ?
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!
Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!