Weather Latest Update: ఏపీలో నేడు తేలికపాటి జల్లులు, తెలంగాణలో పొడి వాతావరణమే: ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 68 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
ఢిల్లీలో విపరీతంగా వాయు కాలుష్యం
టపాసులపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతోపాటు చుట్టుపక్కల నగరాల్లో ఏమీ కనిపించలేదు. ప్రజలు బాణాసంచా కాల్చారు. ఫలితంగా ఢిల్లీ గాలి మరోసారి విషమంగా మారింది. కరోల్ బాగ్ ఏరియాలో ఏక్యూఐ 500 దాటింది. ఇది WHO ప్రమాణాల కంటే 43 రెట్లు ఎక్కువ. AQICN ప్రకారం, ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 900కి చేరుకుంది.
రిపోర్టుల ప్రకారం, వాతావరణ ఏజెన్సీ aqicn.org ప్రకారం, ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఉదయం 5 గంటలకు ప్రమాదకరమైన 969కి చేరుకుంది. 0-50 మధ్య ఉన్న AQI ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. 300 కంటే ఎక్కువ విలువ 'ప్రమాదకర' గాలి నాణ్యతను సూచిస్తుంది. అదే సమయంలో, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, ఢిల్లీలో గాలి నాణ్యత 'పూర్' కేటగిరీలోనే ఉంది. ఆనంద్ విహార్‌లో AQI 296, ఆర్కే పురంలో 290, పంజాబీ బాగ్‌లో 280 గా ఉంది.