Weather Updates: రెండ్రోజుల్లో ఈ ప్రాంతాల్లోకి రుతుపవనాల ఎంట్రీ, ఇక్కడ తీవ్రంగా వడగాడ్పులు, తెలంగాణలో వానలు
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే అవకాశం ఉంది.
Weather Latest News: వచ్చే రెండ్రోజుల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ కేంద్రం అధికారులు తాజాగా వెల్లడించిన సమాచారం మేరకు.. ‘‘వచ్చే 48 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, దక్షిన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
తర్వాతి 2 రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.’’ అని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Weather warning and synoptic features of weather for Andhra Pradesh dated 09.06.2022 pic.twitter.com/pcscwHPXXj
— MC Amaravati (@AmaravatiMc) June 9, 2022
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల జూన్ 10న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Telangana Weather Update
ఇక తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ వివరాలు ఇలా ఉండనున్నాయి. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాుల అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో 3 రోజులు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Weather warning for next five days dated 09.06.2022 pic.twitter.com/jOkAbcAQme
— MC Amaravati (@AmaravatiMc) June 9, 2022
‘‘హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీల సెల్సియస్, 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు (గాలుల వేగం గంటకు 10 నుంచి 15 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) June 9, 2022