Weather Updates: వెదర్ అలర్ట్! తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, ఈ ప్రాంతాల్లో మరింతగా
Weather Updates: అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
Synoptic features of weather inference of Andhra Pradesh dated 09.03.2022 pic.twitter.com/Vd1Gu2qrWR
— MC Amaravati (@AmaravatiMc) March 9, 2022
‘‘ఆంధ్రప్రదేశ్, యానాంలో తక్కువ ఎత్తులో ప్రధానంగా ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితిని ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 3 రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. దక్షిణ కోస్తా, యానాం ప్రాంతాల్లో నూ వాతావరణ పొడిగానే ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉంటుంది’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.
Fisherman warnings of Andhra Pradesh for the next 5 days dated 09.03.2022 pic.twitter.com/eOpt6ZZfYt
— MC Amaravati (@AmaravatiMc) March 9, 2022
‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కర్నూలు, కడప, చిత్తూరు తూర్పు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత 39 డిగ్రీలను తాకుతోంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ ఎండల తీవ్రత ఎక్కువైంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడ ఎండల తీవ్రత మరింత పెరిగింది. భయటకి వెళ్లేటప్పుడు జాగ్రత్తపడండి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మార్చి 13 నుంచి వడగాల్పులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 33, 34 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 9, 2022