(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ, తెలంగాణలపై ప్రభావం
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert To AP: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడగా.. తమిళనాడు తీరం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండనుందని అధికారులుపేర్కొన్నారు. వ. వీటి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే సాధారణ వర్షపాతం ఉంటుందని, హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్ర వారాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: నిలకడగా పసిడి.. స్వల్పంగా పెరిగిన వెండి.. మీ నగరంలో నేటి ధరలు ఇలా..
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 4, 2021
ఏపీకి రెయిన్ అలర్ట్..
ఏపీలో ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్నాయి. శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా వైపు వస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరోవైపు నవంబర్ 6న తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యాకారులు రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. పరిస్థితులు అనుకూలించకపోతే వేటకు వెళ్లకపోవడం మంచిదని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
Also Read: గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఇంధన ధరలు.. తాజా రేట్లు