అన్వేషించండి

Visakha Capital: 'విశాఖ రాజధాని ఇప్పట్లో లేనట్లే' - బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Visakha Capital: ఏపీ రాజధానిగా విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందన్న ఆయన, కోర్టు తీర్పు ఆధారంగానే రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు తీర్పు కంటే ముందే సీఎం వచ్చి కూర్చుంటారంటే ఎవరూ అభ్యంతరం చెప్పబోరన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని ఆరోపించారు.

విశాఖ నుంచి పాలనకు సీఎం రెడీ 

మరోవైపు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబరు నుంచే విశాఖ నుంచి పాలన అందించేందుకు రెడీ అవుతున్నారు. రుషికొండపై 4 బ్లాకుల్లో మొత్తం 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భవనాల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసంతో పాటు క్యాంపు కార్యాలయం ఉండనున్నాయి. ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ ఉపయోగిస్తారన్న ప్రచారం సాగుతోంది. రుషికొండ చుట్టూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కొండ చుట్టూ 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, 24 గంటలూ నిఘా తీవ్రం చేశారు. కొండ వద్ద విశాఖ- భీమిలి బీచ్‌ రోడ్డు వైపు 2, కొండ వెనుక సముద్ర తీరంలో ఓ తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. 

అధికారుల విస్తృత ఏర్పాట్లు

సీఎం జగన్ ప్రకటనతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి, సీఎంవోలో కీలక అధికారుల నివాసాలకు అవసరమైన భవనాలను గుర్తించేందుకు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ నియమించింది. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ, విశాఖ నగరంలో అందుబాటులో ఉన్న భవనాల వివరాలు సేకరించే పనిలో బిజీ అయ్యారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్‌ ఇప్పటికే జిల్లా అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. ఏయే ప్రాంతంలో  ఏయే భవనాలు ఖాళీగా ఉన్నాయి ? ఆ భవనాల విస్తీర్ణం ఎంత ? ఏ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంది ? భద్రతాపరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపై  ఐఏఎస్ ల కమిటీ వివరాలు సేకరిస్తోంది. రుషికొండ వద్ద రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఎదురుగా ఉన్న పర్యాటక శాఖకు చెందిన మూన్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు స్థలంపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget