అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

BJP Vishnu : తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించవద్దు - నిర్ణయం వెనక్కి తీసుకోవాలని సీఎంకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి లేఖ !

టీటీడీ నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని సీఎం జగన్‌కు విష్ణువర్ధన్ రెడ్డి లేఖ శారు. ఇలాంటి నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు.

 

BJP Vishnu :  శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ కు లేఖ రాశారు.  హిందు ధర్మంలో భక్తులు దేవుడికి తమ కష్టంతో వచ్చిన సంపాదనను భక్తితో హుండీ లో  మొక్కులుగా సమర్పణ చేసే కానుకల విషయంలో  హిందూ సమాజంలో గట్టి విశ్వాసాలు ఉంటాన్నారు  అందుకే  దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ  హిందూ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని  ఏ ప్రభుత్వాలూ , వ్యక్తులు ఆశించరు, ఇతర అవసరాలకు వినియోగించరు. చివరికి భక్తులు ముడుపు కట్టిన సొమ్ములు కూడా దేవునికి తప్ప మరే కార్యక్రమం కోసం వాడరు.  దేవునికి వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభిృవద్ధికి, భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి అర్చకులుకు మాత్రమే వినియోగిస్తారని గుర్తు చేశారు. 

తిరుపతి అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత 

నేడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయంలో ఒక్క శాతం నిధులు తిరుపతిలో భక్తులు సౌకర్యాలు వారు అభివృద్ధికి కేటాయించాలని పాలకమండలిలో కొందరు చేసిన సూచనలు , అభిప్రాయాలతో  పర్యవసానాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు.  ఆమోదం కోసం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులతో  తిరుమల, తిరుపతిలో  ఉన్నటువంటి దేవాలయ ఆస్తులు పరిరక్షణ ఉద్యోగుల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని పాలకమండలి సభ్యులు లేదా అధికారులు  ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ ఇలాంటి అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలి. తిరుపతిని ఇప్పటికీ స్మార్ట్ సిటీల జాబితాలో  నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి నగరపాలక సంస్థకు ఆర్థిక సహకారం అందించాలి . లక్షల మంది భక్తులు తిరుపతికి రావడం వాస్తవమే ఈ ప్రాంతం శుభ్రంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామన్నారు.   

హిందూ ధర్మ ప్రచారానికే ఖర్చు చేయాలి ! 
  
ప్రపంచంలోని హిందువులందరికీ శ్రీవారికి ఆరాధ్యదైవం. అందుకే అందరూ ఆయనకు తృణమో, పణమో సర్పించుకుంటారు.  భక్తుల ఉద్దేశం ఆ సొమ్మును ప్రభుత్వాలో లేకపోతే మరొక వ్యవస్థో తీసుకుని ఖర్చు పెట్టాలని కాదు.  నిజంగా అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా ఆయా కార్యక్రమాలకే వారు విరాళిచ్చేవారు. వారి ఉద్దేశం శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. హిందూ ధర్మ ప్రచారం చేయడం. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  రానున్న రోజులలో మన రాష్ట్రంలో ఉన్న పేరెన్నిక గన్న ఆలయాలు సింహాచలం అప్పన్న దేవస్థానం , విజయవాడ  కనక దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లిఖార్జునుడి కోవెలల్లో దేవుడి సొమ్మును  ఇలా ప్రత్యేకంగా నగరాల అభివృద్ధి కోసం కేటాయిస్తే పరిస్థి రాకూడదని, అలా చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ ఆ పాలక వర్గాలకు రాకూడదని గుర్తు చేస్తున్నాం. శ్రీవారి భక్తులు ఇచ్చే విరాళాలు, కానుకలను వినియోగిస్తే సార్థకత లభించినట్లు అవుతుంది.  తిరుపతి అభివృద్ధి ప్రభుత్వం బాధ్యత. తిరుమలకు వచ్చే భక్తుల వల్ల తిరుపతి కూడా అభివృద్ధి చెందుతోంది. ఎంతో ఆదాయం వస్తోంది. శ్రీవారి  భక్తులవల్ల తిరుపతిలో ఎంతో సంపద వృద్ధి చెందుతోంది. అందుకు ప్రతిగా... ప్రభుత్వం తరుపున శ్రీవారికి ఎంతో కొంత ఉడతా భక్తిగా మరింత మేలు చేయాల్సింది పోయి...  శ్రీవారి నిధుల్నే ఒక్క శాతం తీసుకుని తిరుపతిని అభివృద్ధి చేయాలనుకుకోవడం సమంజసం కాదన్నారు. 

 

 

టీటీడీ తీర్మానాన్ని తిరస్కరించాలి  

ఇది ఓ రకంగా ప్రభుత్వం బాగ్యతలనుండి తప్పించుకోవడమే. అందుకే్ తిరుపతిని అభివృద్ధి చేయడానికి తిరుమల పాలకవర్గం ఆలోచన చేసినట్లు ప్రతి సంవత్సరం 100 కోట్లు తిరుపతి కార్పొరేషన్ కు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని కోరుతున్నానన్నారు. భక్తుల కానుకల వినియోగం విషయంలో దయచేసి టీటీడీ నిర్ణయాన్ మరో సారి సమీక్ష చేయాలి. రాష్టప్రభుత్వం సైతం టీటీడీ మరో సారి ఆలోచన చేయమని ఆదేశంచిచాలని అంతవరకు ఆ తీర్మానం ఆమోదించవద్దని కోరుతున్నాము. టీటీడీ తీసుకున్ ఈ ననిర్ణయంలో మరో సారి ధార్మిక సంస్థలు ధర్మాచార్యులు పీఠాధిపతులు భక్తుల అభిప్రాయాన్ని సైతం తీసుకొని ఇలాంటి నిర్ణయాల విషయంలో నేడు గాని భవిష్యత్తులో గాని ఆలోచన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాం.  టీటీడీ పాలక మండలి తమ నిర్ణయాన్ని భక్తులు మనోభావాలు , అభిప్రాయాలు పరుగనలోనికి తీసుకోని పునర్ సమీక్ష చేసుకొని ఏ నిర్ణయాన్ని తక్షణ ఉపసంహరించుకోవాలని కోరారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget