![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vizag Fishing Harbor : వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం - 60కి పైగా బోట్లు దగ్దం
Vizag News: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 60కిపైగా బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లింది.
![Vizag Fishing Harbor : వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం - 60కి పైగా బోట్లు దగ్దం Vizag Fire Accident More than 60 boats were gutted in a fire at Vizag Fishing Harbour Vizag Fishing Harbor : వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం - 60కి పైగా బోట్లు దగ్దం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/3892b8d1b1b4a11166cdd336df912cc31700443956842215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విశాకలోని ఫిషింగ్ ఆర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున ఒక్కసారిగా చెలరేగిన మంటలకు 60కిపైగా బోట్లు తగలబడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగాఉండే ప్రజలు వెంటనే అప్రమత్తం అయినప్పటికీ ఆస్తినష్టాన్ని తగ్గించలేకపోయారు.
స్థానిక మత్స్యకారులకు ఈ బోట్లే ప్రధాని జీవనాధారం. రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోవడంతో వాళ్లంతా బోరున విలపిస్తున్నారు. ఒక్కో బోటు ఖరీదు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఉంటుందని అంటున్నారు. ఈ బోట్ల వల్ల కోట్లలో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
ప్రస్తుతానికి 60 వరకు బోట్లు కాలిపోయాయని చెబుతున్నప్పటికీ ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. అధికారులు వెళ్లి పరిశీలిస్తే కాని ఎంత నష్టం చెప్పలేని పరిస్థితి ఉందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. బోటు ఓనర్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదని అంటున్నారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రాలకు కూడా సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొన్ని గంటల పాటు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఇది ప్రమాదంలా లేదని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనిగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)