News
News
X

Vizag Beach Cleaning: విశాఖలో ‘మెగా బీచ్ క్లీనింగ్’, చెత్త ఎత్తిన మంత్రులు - పాల్గొన్న 20 వేల మంది

అమెరికాకు చెందిన పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.

FOLLOW US: 

సముద్ర తీరం ప్రాంతంలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి స్వచ్ఛత నెలకొల్పే లక్ష్యంగా విశాఖపట్నంలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు. అమెరికాకు చెందిన పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ ఈ కార్యక్రమం చేపట్టింది. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్నాథ్‌, నగర మేయర్ గొలగిని వెంకట హరి కుమారి, కలెక్టర్, పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. వీరు కూడా చెత్త సేకరించి బీచ్ ను శుభ్రం చేసే పనిలో భాగం అయ్యారు.

ఇందుకోసం శుక్రవారం (ఆగస్టు 26) ఉదయం ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి బీచ్ వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా విశాఖ తీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని ఎత్తేు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్ లో దాదాపు 20 వేల మందికి పైగా వలంటీర్లు పాల్గొన్నారు. బీచ్ రోడ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తేసేందుకు అక్కడే రూపొందించిన ఇసుక శిల్పం పర్యటకులను ఆకట్టుకుంటుంది. 

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం ద్వారా విశాఖ నగరాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్లాస్టిక్ నిషేధించడం ద్వారా పర్యావరణం కాపాడుకోవచ్చని అన్నారు. పర్యావరణం బాగుంటేనే ప్రపంచం బాగుంటుందని, ప్లాస్టిక్ నిషేధం వల్ల సముద్ర జీవరాశులకు మేలు కలుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కావడం సంతోషకరమని అన్నారు.

రీసైక్లింగ్ ద్వారా ఆదాయం
ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. అందుకే అమెరికాకు చెందిన పార్లె సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా భారత నేవీ హెలికాప్టర్ల ద్వారా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్

ఏపీలో ప్లాసిక్‌ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. నేడు విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపై సీఎం మాట్లాడుతూ.. నేడు ఒక్కరోజే ఉదయం 6 నుంచి 8 వరకూ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి అనేవి నాణేనికి రెండు వైపులు అని జగన్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు. ఈ సందర్భంగా సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్‌ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం జగన్‌ సమక్షంలో పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది.

భూమిపై 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తోంది. అందుకే సముద్రాన్ని కాపాడుకోవాలి. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీస్తుంది.

Published at : 26 Aug 2022 11:39 AM (IST) Tags: adimulapu suresh Vizag rk beach Gudiwada Amarnath parley for the oceans mega beach cleaning program

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత, సముద్రంలో షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు

Visakha News : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద ఉద్రిక్తత, సముద్రంలో షిప్ లను అడ్డుకుంటున్న మత్స్యకారులు

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, IMD ఎల్లో అలర్ట్

MP CM Ramesh : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీ నేతలే తప్పుబడుతున్నారు- సీఎం రమేష్

MP CM Ramesh : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును వైసీపీ నేతలే తప్పుబడుతున్నారు- సీఎం రమేష్

Manyam News: మన్యం జిల్లాలో విషాదం, ఆడుకుంటూ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Manyam News: మన్యం జిల్లాలో విషాదం, ఆడుకుంటూ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ