అన్వేషించండి

Srikakulam News | భారీ వర్షాలతో ఉప్పొంగిన నది, అమాంతం పెరిగిన వంశధార నీటిమట్టం

Andhra Pradesh News | వాయుగుండం తీరం దాటినా దాని ప్రభావం శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంది. ఇన్ ఫ్లో ఎంత వస్తుందో, గేట్లు ఎత్తి అధికారులు ఔట్ ఫ్లో అంతే విడుదల చేస్తున్నారు.

Srikakulam News | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోను ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగావాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఆ వరద నీరు అంతాసమీపంలోని పంట పోలాలను ముంచెత్తింది. జిల్లాలోనివంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులలో వరద ప్రవాహం పెరగడంతో వాటి పరివాహక ప్రాంతంలోని పంటలునీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలలోపంటలకి నష్టం వాటిల్లింది. వరితో పాటు మొక్క జొన్నఇతరత్ర పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కూడా అనేకప్రాంతాలలో పోలాలు నీటిలోనే మునిగిఉన్నాయి. వాటినిఅలా చూసి రైతులు తల్లడిల్లుతున్నారు

హిరమండలం, వంశధార నది తీర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడటంతో వంశధార నది నీటి మట్టం అమాంతంగా పెరిగింది.  గొట్టాబ్యారేజి దిగువకు 27,617క్యూసెక్కుల నీటిని సంబంధిత అధికారులు దిగువకు విడిచిపెడుతున్నారు. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు పడుతుండటంతో ఉదయం నాటికి 10,686 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, ఒక్క సారిగా 27,545 క్యూసెక్కుల నీటిని గొట్టాబ్యారేజికి సంబంధించిన 10 గేట్లను 50 సెంటీమీటర్లలో, మరో 9 గేట్లను 40 సెంటీమీటర్ల ఎత్తులో ఎత్తి 27,545 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు గొట్టాబ్యారేజి కంట్రోల్ కార్యాలయ విభాగం డీఈ ఎం.రంగనాయకులు తెలిపారు. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిందని, నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుందని ఆయన తెలిపారు. అలాగే వంశధారకు ఇన్ ఫ్లో 25,823 క్యూసెక్కుల నీరు చేరుతుందన్నారు. దిగువ ప్రాంత ప్రజలు ఆంధోళన చెందవద్దని ఆయన సూచించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని నిలుపదల చేసామని ఆయన తెలిపారు.

దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు..

వంశధార నదితీర లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు సంయుక్తంగా కలసి వెళ్లి సంబంధిత గ్రామ ప్రజలను అప్రమత్తం చేసారు. ఎలాంటి విపత్తు జరిగినా రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సమాచారం అందజేయాలని వారు సూచిం చారు. అలాగే గొట్టాబ్యారేజి వద్ద వరద నీటి ఉధృతిని టెక్కలి ఆర్డీవో బి. సుదర్శనదొర, మండల ప్రత్యేకాధికారి జేవీఎస్ఎస్ రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం గొట్టాబ్యారేజి కంట్రోల్ కార్యాలయంలో సంబంధిత ఇంజనీరింగ్ అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వరద నీటి ఉదృతి, తదితర వివరాలను ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని వారు సూచించారు. అలాగే మండల వ్యవసాయాధికారి బి. సంధ్య పలు ప్రాంతాలను వెళ్లి పరిశీలించి పంటలు ముంపునకు గురికాలేదని ఆమె తెలిపారు.

తృటిలో తప్పిన ముప్పు..

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ బి. వెంకటరమణతో పాటు రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా కల్లట పంచాయతీ జిల్లేడుపేట గ్రామం పరిశీలించేందుకు వెళ్లారు. కాగా కల్లటా జిల్లేడుపేట గ్రామాల మద్య వంతెన లేకపోవటంతో మహేంద్రతనయా నదిపై నాటు పడవపై ప్రయాణించి జిల్లేడుపేట గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడవపై తహశీల్దార్ వెంకటరమణతో పాటు వీఆర్వోలు, సచివాలయ సిబ్బందితో కలసి వెళ్తున్న నేపథ్యంలో పడవ నడిపే కర్ర (తెడ్డు) పడిపోవటంతో వాటిని తీసేందుకు పడవ నడిపే వ్యక్తి నదిలోకి గెంతటంతో నీటి ప్రవాహానికి పడవ సుమారు 200 మీటర్ల దూరం వరకు నదిలో వెళ్లిపోయింది. మరి కొద్ది సమీపంలోనే సుడిగుండం ఉండటం... గుర్రపుడెక్క పడవకు అడ్డురావటంతో పడవ అక్కడ నిలిచిపోయింది. దీంతో సంబంధిత అధికారులు భయాందోళన చెందారు. పడవ నడిపే వ్యక్తి గమనించి వెళ్లి పడవ వద్దకు చేరుకుని ఒడ్డుకు చేరటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు జిల్లేడుపేట గ్రామం వెళ్లి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత గ్రామస్తులకు వారు సూచించారు. అలాగే వంశధార నదీతీర ప్రాంతాలైన అంబావల్లి, రెల్లివలస, పిండ్రువాడ, అక్కరాపల్లి గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు. వంశధార నది ఉధృతంగా పరవశించడంతో గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో రోడ్లన్నీ కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది అయితే అక్కడ అధికారులు కర్రలు కట్టి మరి అది బయటకు ఎవరు వెళ్ళవద్దని హెచ్చరిక బోర్డులు అంటించారు.

కర్రలు కట్టి పేపరు అతికించడం కాదు  
హిరమండలం,  కాస్త జోరుగా వర్షం కురిస్తే చాలు దబ్బపాడు గ్రామస్థులు రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కడపలవానిపేట గడ్డలో నీరు ఉధృతం అవ్వడంతో ఎల్ఎన్పేట మండలం తురకపేట గ్రామం నుంచి దబ్బపాడుకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడున్న కాజ్వే నుంచి ఆరీగా నీరు ప్రవహించడంతో అధికారులు ముందస్తు చర్యలుగా కర్రలు కట్టి ఓ పేపరును అతికించారు. ప్రమాదం.. ఇచ్చట కాలువ ప్రవాహం ఎక్కువగాఉంది. కావున ఎటువంటి రాకపోకలు చేయరాదని ప్రభుత్వం వారి ఆదేశమంటూ అతికించారు. దీనిపై ఆ ప్రాంతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణగా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోవడం మంచిదేగాని తమ రాకపోకలకు సౌకర్యంగా వంతెన నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ వంతెన నిర్మించడం వల్ల వాడవలస, మిరియాబిల్లి తదితర గ్రామస్థులు శ్రీకాకుళం వైపు వచ్చేటప్పుడు ఈ మార్గమే దగ్గరవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జోక్యం చేసుకుని కొన్ని దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న ఈ గడ్డపై వంతెన నిర్మించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు..

Also Read: అచ్చెన్నాయుడు మాటంటే మాటే, రాష్ట్ర పండగగా కొత్తమ్మతల్లి జాతర - భారీగా నిధులు సైతం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget