Oasis Fertility Vizag: సంతానం లేని దంపతులకు అసాధారణ చికిత్స, అత్యుత్తమ సెంటర్ ఒయాసిస్ ఫెర్టిలిటీ
ఒయాసిస్ ఫర్టిలిటీ ఘనంగా ఐదో వార్షికోత్సవ వేడుకలుమెరుగైన వైద్యంతో ఐదేళ్లుగా అత్యుత్తమ ఫలితాలు
సంతానం లేని దంపతులకు అసాధారణమైన చికిత్స, అత్యుత్తమ సంరక్షణ అందించడంలో విశాఖపట్నంలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ముందుందని ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక పొట్లూరి తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ ఐదో వార్షికోత్సవాన్ని నగరంలోని వాల్తేరు అఫ్ ల్యాండ్స్ లో గల ఆసుపత్రిలో ఆదివారం (ఆగస్టు 13) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంధ్యత్వం ఇప్పటికీ పెద్ద సమస్యగా మిగిలిపోయిందన్నారు. అయితే, సరైన సమయంలో సరైన చొరవ అవసరమని అన్నారు. పునరుత్పత్తి ఔషధం రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని అన్నారు. సంతానోత్పత్తితో ఇబ్బంది పడుతున్న దంపతులు పిల్లలను కనడానికి ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు.
చికిత్స ఆలస్యం చేస్తే ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ (వైజాగ్) భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాలలో ఒకటని అన్నారు. అత్యుత్తమ చికిత్స, అసాధారణమైన సంరక్షణతో మంచి రిజల్ట్స్ అందిస్తుందని అన్నారు. ఇది అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకురావడంలో నిబద్ధత, అంకితభావం, నైపుణ్యంతో ముందుకు వెళ్తుందన్నారు.
ఎంతో మంది కళ్లలో ఆనందం
ఎంతో మంది పిల్లలు కావాలనుకుంటున్నవారికి చికిత్స చేయడం ద్వారా ప్రారంభం నుంచి వేలాది కుటుంబాల్లో బిడ్డ పుట్టిందన్న ఆనందాన్ని కల్పించామన్న విషయం తమకు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని రాధిక పొట్లూరి అన్నారు. ఈ పేరెంట్‌హుడ్ జర్నీలో ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉన్న మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తమ సాంకేతిక ఆధారిత అధునాతన చికిత్సా ఎంపికలతో దంపతులు వారి పేరెంట్‌హుడ్ కలను సాధించడంలో సహాయపడాలని కోరుకుంటున్నామని తెలిపారు.
అయితే, ఏ జంటైనా ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించాలని కోరారు. అస్థిరమైన జీవనశైలి, కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, మాతృత్వం ఆలస్యమైనా వంధ్యత్వం పెరగడానికి కారణమని అన్నారు. వ్యక్తిగత సంతానోత్పత్తి చికిత్సలతో పాటు జీవన శైలిలో మార్పులు చేసుకుంటే వంధ్యత్వాన్ని అధిగమించడానికి అవకాశం ఉందని అన్నారు.
ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వైజాగ్ కేంద్ర సహకారంతో గర్భం దాల్చిన దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ గైనకాలజిస్టులు, పలువురు కుటుంబీకులు పాల్గొన్నారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి
ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్. సంతానోత్పత్తి చికిత్సలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులు, ప్రోటోకాల్‌లను తీసుకురావడం ద్వారా భారతదేశంలో పునరుత్పత్తి విధానాన్ని రీడిఫైన్ చేసింది. ఇది తల్లిదండ్రులకు స్నేహపూర్వకమైన 'వన్-స్టాప్' డే-కేర్ క్లినిక్‌ను అందిస్తుంది. ఇక్కడ సంప్రదింపులు (కన్సల్టేషన్), పరిశోధనలు (రీసెర్చ్), చికిత్స (ట్రీట్మెంట్) అన్నీ ఒకే సెంటర్ లో పొందవచ్చు. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఒయాసిస్ అంతర్జాతీయ అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందం నేతృత్వంలోని నిర్వహిస్తున్నారు. వారి అధిక నాణ్యత సేవల ద్వారా దాని అధిక విజయాలతో అద్భుతమైన ఖ్యాతిని పొందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో 30 కేంద్రాలకు ఒయాసిస్ ఫెర్టిలిటీ విస్తరించింది. మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి: 9963980259/ 9985310069