By: ABP Desam | Updated at : 02 Sep 2023 05:25 PM (IST)
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్
Gudivada Amarnath on Jamili Elections
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల (One Nation One Election) పై చర్చ జరుగుతోంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలతో ఏపీకి పెద్దగా నష్టమేం లేదన్నారు. ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు. పార్టీ తుది నిర్ణయం సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.
పార్టీ ఆదేశాల మేరకు ఎండాడలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం ప్రారంభించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కార్యక్రమంలో కోలా గురువులు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీ, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, పసుపులేటి బాలరాజు, కేకే రాజు, ఎంపీ ఎంవీవీ, మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో మొదట కార్యాలయాన్ని ప్రారంభించాం అన్నారు. త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామన్నారు. ఇకనుంచి జిల్లాకు సంబంధించి కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తామని తెలిపారు.
అవసరాన్ని బట్టి ఈ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సెంట్రల్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఆరు, ఏడు నెలల్లో ఎన్నికలు రానున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా జమిలి ఎన్నికలు వచ్చినా వైసీపీకి ఏ అభ్యంతరం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడంతో తమకు ఏ నష్టం లేదన్నారు. అయితే జమిలి ఎన్నికలపై పార్టీలో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జమిలితో రాష్ట్రంలో కేవలం మూడు నెలలు ముందుకు ఎన్నికలు వస్తాయని, అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేది వైసీపీయేనని దీమా వ్యక్తం చేశారు.
ప్రజలు మరోసారి సీఎం జగన్ కు అధికారం ఇస్తారని ఆకాంక్షించారు. 2019లో వచ్చిన ఫలితాలు 2024 ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామన్నారు. గడప గడపకు ప్రభుత్వంతో ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రజలకు తాము చేసిన మేలు గురించి, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నాం. వారి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి వైసీపీ కార్యకర్త తమ పార్టీ విజయానికి కృషి చేయాలని, సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని పిలుపునిచ్చారు.
జమిలీ దిశగా కేంద్రం కసరత్తులు..
జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలీపై ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 18-22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో జమిలి ఎన్నికలపై చర్చించేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జ్‌లు, మాజీ కేబినెట్ సెక్రటరీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్, నిపుణులు ఉంటారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు (One Nation, One Election Bill) ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు
రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా
AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు
జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
/body>