News
News
X

 PM Modi Tour : విశాఖలో ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

PM Modi Tour : ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని పోలీసులు వెల్లడించారు.

FOLLOW US: 
 

PM Modi Tour : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల బహిరంగ సభ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. సుమారు రూ. 15 వేల కోట్లతో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఈ నెల 12న జరగనున్న ప్రధాని బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్ నాథ్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అన్నారు. 30 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

సభకు 3 లక్షల మంది 

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారని, 3 లక్షల మంది హాజరు కానున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి 2 లక్షల మంది, శ్రీకాకుళం, విజయనగరం, ఏఎస్ఆర్ జిల్లాల నుంచి మరో లక్షమంది సభకు హాజరవుతారన్నారు. 11వ తేదీ సాయంత్రం ప్రధాన మంత్రి విశాఖ చేరుకుంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని విశాఖ పర్యటన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే కార్యక్రమం కావడంతో రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యతగా భావించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని పర్యటనకు రాష్ట్రప్రభుత్వం తరపున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. సమయం తక్కువగా ఉన్నందున, కోర్టులో అడ్డంకులన్నీ తొలగిపోయినప్పటికీ, భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన వీలుకావడం లేదని అన్నారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం 

News Reels

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ మొదటి నుంచి వ్యతిరేకమేనని, ఈ మేరకు ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ 125 మంది ఎంపీల సంతకాలతో ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని ఎంపీ విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, జీవీఎంసీ కమీషనర్ తో ఏర్పాట్లు పరిశీంచిన విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, అమర్ నాథ్ లు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు.  

విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు 

 ప్రధాని మోదీ బహిరంగ సభ, రోడ్ షో కారణంగా రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు. మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ నుంచి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి గానీ, త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి మద్దిలపాలెం ఏయూ ఆర్చ్  వైపు భద్రత కారణాల దృష్ట్యా  ఎటువంటి సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. 

ప్రయాణాలు వాయిదా వేసుకోండి

రేపు విశాఖలో పలు కార్యక్రమాలు ఉండడంతో సాధారణ ప్రయాణికులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు.  12వ తేదీన ప్రధాన మంత్రి బహిరంగ సభకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేకమైన రూట్ ను కేటాయించారు. నోవాటెల్, సర్క్యూట్ హౌస్ నుంచి సెవెన్ హీల్స్ హాస్పిటల్ కుడి వైపునకు తిరిగి గొల్లలపాలెం జంక్షన్ మీదుగా ఆశీలమెట్ట  స్వర్ణ భారతి స్టేడియం వద్ద వారికి కేటాయించిన ప్రత్యేకమైన రహదారి (BRTS) నుంచి ప్రయాణించి మద్దిలపాలెం AU Arch వద్దకు చేరుకోవాలి.   వివిధ వాహనాల ద్వారా సభాస్థలికి వచ్చే వాహనదారులకు సంబంధిత రూట్ మాప్ కేటాయించారు.  

భారీ వాహనాల దారి మళ్లింపు 

12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖపట్నం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లే అన్నీ భారీ వాహనాలను ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపుగా మళ్లించారు. అదే విధంగా అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్నీ రకాల భారీ వాహనాలను లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా మళ్లించారు.  శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రధానంగా మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాలైన పెద్ద వాల్తేరు కురుపాం సర్కల్ నుండి త్రీ టౌన్ పోలీ స్టేషన్ వైపు, స్వర్ణ భారతి నుంచి మద్దిలపాలెం వైపు, మద్దిపాలెం నుండి పిఠాపురం, మంగాపురం కాలనీ వైపు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. శనివారం నగరంలో ప్రముఖుల పర్యటనలు, వారి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  

Published at : 10 Nov 2022 10:18 PM (IST) Tags: PM Modi Visakhapatnam AP News Traffic Diversions MP Vijayasaireddy

సంబంధిత కథనాలు

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Lab Technician Posts: ఏపీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

Lab Technician Posts: ఏపీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

GVMC Recruitment: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు, అర్హతలివే!

GVMC Recruitment: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 482 ఉద్యోగాలు, అర్హతలివే!

AP Wedding Rush: కళకళలాడుతున్న కళ్యాణ మండపాలు- మూఢం ముగియడంతో మోగుతున్న బాజాభజంత్రీలు

AP Wedding Rush: కళకళలాడుతున్న కళ్యాణ మండపాలు- మూఢం ముగియడంతో మోగుతున్న బాజాభజంత్రీలు

టాప్ స్టోరీస్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా

IND vs BAN 1st ODI: ఐదు వికెట్లతో మెరిసిన షకీబ్- ఓ మోస్తరు స్కోరుకే ఆలౌట్ అయిన టీమిండియా